AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Flights: బస్సు ధరలకే విమాన టికెట్లు కొనొచ్చా! ఎలాగబ్బా? ఈ గూగుల్ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి.. 

వాస్తవానికి బస్సు, రైలు, మెట్రో వంటి ప్రయాణ సాధనాల్లో టికెట్ల రేట్లు స్థిరంగా ఉంటాయి. కానీ విమానాల్లో అలా కాదు. ఎయిర్ లైన్స్ బట్టి, రూట్ కి ఉన్న డిమాండ్ ను బట్టి రేటులో మార్పు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఎంత తక్కువ అంటే కేవలం బస్సు చార్జీకే ప్రయాణించేయొచ్చు! అయితే అది ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడు పెరుగుతుంది? అనేది అంచనా వేయడం కష్టం. అందుకోసం గూగుల్ ఫ్లైట్స్ సరికొత్త ఫీచర్ ను ఆవిష్కరించింది.

Google Flights: బస్సు ధరలకే విమాన టికెట్లు కొనొచ్చా! ఎలాగబ్బా? ఈ గూగుల్ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి.. 
Flight Tickets
Madhu
|

Updated on: Aug 31, 2023 | 5:00 PM

Share

విమానంలో ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ అందరూ దానిని అందుకోలేరు. అందుకు కారణం వాటి చార్జీలే. సాధారణంగా విమాన చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక టికెట్ కొనాలన్నా సామాన్యుడికి కష్టమే. అయితే ఈ టికెట్ రేట్లు స్థిరంగా ఉండవు. డిమాండ్ ను బట్టి మారుతుంటాయి. వాస్తవానికి బస్సు, రైలు, మెట్రో వంటి ప్రయాణ సాధనాల్లో టికెట్ల రేట్లు స్థిరంగా ఉంటాయి. కానీ విమానాల్లో అలా కాదు. ఎయిర్ లైన్స్ బట్టి, రూట్ కి ఉన్న డిమాండ్ ను బట్టి విమాన టికెట్ రేటులో మార్పు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఎంత తక్కువ అంటే కేవలం బస్సు చార్జీకే ప్రయాణించేయొచ్చు! అయితే అది ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడు పెరుగుతుంది? అనేది అంచనా వేయడం కష్టం. అందుకోసం గూగుల్ ఫ్లైట్స్ సరికొత్త ఫీచర్ ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్తో అతి తక్కువ ధరలోనే మీరు విమానం టికెట్లు కొనుగోలు చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టికెట్ రేటు ఎప్పుడు తగ్గుతుంది..

గూగుల్ ఫ్లైట్స్ అనే ఫీచర్ ఇంతకు ముందే అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు గతంతో పోల్చితే తగ్గిందా? లేక పెరిగిందా? అనేది తెలుపుతుంది. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫీచర్ తో విమాన టికెట్టు ఏ సమయంలో తక్కువ ఉంటుంది? ఏ సమయంలో ఎక్కువ ఉంటుంది? ఎప్పుడు బుక్ చేసుకుంటే మన సొమ్ము ఆదా అవుతుంది? అనే విషయాలను తెలియజేస్తుంది. గూగుల్ ఫ్లైట్స్ లోని ఈ ఫీచర్ పేరు చీపెస్ట్ టైం టు బుక్. ఈ ఫీచర్ గతంలోని డేటా ఆధారంగా ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి ప్రయాణికులకు టికెట్ కొనుగోలు చేసేందుకు ఏది సరియైన సమయమో సూచిస్తుంది. ‘విమానం బయలుదేరే తేదీకి రెండు నెలల ముందు ధరలు బాగా తక్కువగా ఉంటాయి. లేదా టేకాఫ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ధరలు దిగొస్తుంటాయి’ ఇలా గత ట్రెండ్ ను బట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. దీని ద్వారా ప్రయాణికులు టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలో ఓ అంచనాకు రావొచ్చని గూగుల్ తన బ్లాగ్ లో పేర్కొంది.

ఇలా బుక్ చేసుకోవాలి..

మీరు గూగుల్ ఫ్లైట్స్ లోని ఈ ఫీచర్ ను వినియోగించుకోవడం చాలా సులభం. మొదటిగా గూగుల్ ఫ్లైట్స్ సైట్ లోకి వెళ్లి.. మీ ప్రయాణ తేదీలు, గమ్యస్థానాలు నమోదు చేయండి. మీరు విమాన టికెట్లు ఎప్పుడు కొనుగోలు చేస్తే తక్కువ రేటుకు లభిస్తాయో అది మీకు చూపుతుంది. దానిలో మీరు సైన్ అప్ చేసుకుంటే ఆ నిర్ధేశిత గమ్యస్థానాలకు ఎప్పుడు రేట్లు తక్కువగా ఉంటాయో మీకు అలర్ట్ రూపంలో పంపుతుంది. ముఖ్యంగా ధరలు తగ్గినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనినే ప్రైస్ ట్రాకింగ్ అని అంటారు. సాధారణంగా ప్రైస్ ట్రాకింగ్ అనే ఫీచర్ ద్వారా ఎప్పుడు తక్కువ ఉంటే అప్పుడు మనకు నోటిఫికేషన్ పంపుతుంది. ప్రత్యేక తేదీలను సెట్ చేసుకొని కూడా నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

2023లో చవకైన విమాన టికెట్లు..

2023లో ప్రయాణాలకు సంబంధించిన కొన్ని ట్రెండ్స్ ను గూగుల్ తన బ్లాక్ పోస్ట్ లో పంచుకుంది. డిసెంబర్ మధ్యలో ప్రారంభమయ్యే క్రిస్మస్ పర్యటనల కోసం, విమానాలను బుక్ చేసుకోవడానికి ఉత్తమ సమయం అక్టోబర్ అని చెప్పింది. బయలుదేరడానికి 71 రోజుల ముందు సగటు ధర అత్యల్పంగా ఉంటుందని చెప్పింది. బయలుదేరడానికి 22 రోజుల ముందు సగటు ధర తక్కువగా ఉన్న 2022 నుంచి ఇది భిన్నంగా ఉంటుంది. సాధారణ తక్కువ ధర పరిధి ఇప్పుడు బయలుదేరడానికి 54 నుంచి 78 రోజుల ముందు ఉంటుంది. యూఎస్ నుంచి యూరప్‌కు వెళ్లే విమానాల కోసం, బయలుదేరడానికి 72 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు బుక్ చేసుకోవడానికి ఉత్తమ సమయం. ఎందుకంటే యూఎస్ నుంచి యూరప్‌కు సగటు విమాన చార్జీలు కాలక్రమేణా పెరుగుతాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..