Earth Rotation: భూమి భ్రమణ వేగం తగ్గుతోంది.. షాక్‌కు గురి చేస్తున్న అధ్యయనాలు..!
ఈ వేసవిలో భూమి భ్రమణ వేగం పెరిగింది. ఫలితంగా పగటిపూట సమయం కొద్దిగా తగ్గింది. ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (IERS) 2025, జూలై 10వ తేదీ ఇప్పటివరకు సంవత్సరంలో అతి తక్కువ రోజు అని నిర్ధారించింది. 24 గంటల కంటే 1.36 మిల్లీసెకన్లు తక్కువ. జూలై 22 - ఆగస్టు 5 తేదీలలో అసాధారణంగా తక్కువ రోజులు ఉంటాయని అంచనా వేసింది. ప్రస్తుతం పూర్తి రోజు కంటే వరుసగా 1.34 - 1.25 మిల్లీసెకన్లు తక్కువ ఉంటుందని అంచనా.
Updated on: Aug 03, 2025 | 1:30 PM

మన దినచర్య రోజులోని 24 గంటల ప్రకారం నడుస్తుంది. ఉదయం లేవడం నుండి రాత్రి భోజనం చేసి నిద్రపోయే వరకు.. ప్రతి రోజు 24 గంటల ప్రకారం షెడ్యూల్ చేయడం జరిగింది. కానీ ఒకప్పుడు రోజు 24 గంటలు కాదు, 21 గంటలు అని ఎవరైనా మీకు చెబితే ఏమంటారు? అప్పుడు మనసులో వచ్చే మొదటి ఆలోచన ఏమిటంటే, కొన్నిసార్లు రోజులోని అన్ని పనులను చేయడానికి 24 గంటలు సరిపోవు. అటువంటి పరిస్థితిలో ప్రజలు 21 గంటల్లో ఎలా పనులు చేసేవారు. కానీ ఒకప్పుడు రోజు 21 గంటలు మాత్రమే ఉండేదనేది నిజం. సైన్స్ అధ్యయనం ఉంది. ఇందులో సుమారు 60 కోట్ల రోజుల క్రితం, రోజు 21 గంటలు మాత్రమే ఉండేదని శాస్త్రవేతలు గుర్తించారు.

ఒక రోజులో 24 గంటలు, అంటే 86,400 సెకన్లు. ఒక రోజులోని 24 గంటలు భూమి ఒకసారి తిరగడానికి పట్టే సమయం. కానీ భూమి ఏకరీతిలో తిరగదని, దాని భ్రమణ వేగం మారుతూనే ఉంటుందని మీకు తెలుసా..? సాధారణంగా, భూమి భ్రమణ వేగం క్రమంగా తగ్గుతోంది. దీని కారణంగా, ఒక రోజు పొడవు శతాబ్దానికి సగటున 1.8 మిల్లీసెకన్లు పెరుగుతుంది. దీని ప్రకారం, 600 మిలియన్ సంవత్సరాల క్రితం, రోజు 21 గంటలు ఉండేది.

ఈ చిన్న వ్యత్యాసాలను పర్యవేక్షించడానికి, 1955లో అణు గడియారాలను ప్రవేశపెట్టారు. ఈ పరికరాలు వాక్యూమ్ చాంబర్‌లోని అణువుల డోలనాలను లెక్కించడం ద్వారా సమయాన్ని అత్యంత ఖచ్చితత్వంతో కొలుస్తాయి. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (UTC) అని పిలువబడే ఫలిత సమయం దాదాపు 450 అణు గడియారాలపై ఆధారపడి ఉంటుంది. సమయపాలనకు ప్రపంచ ప్రమాణంగా పనిచేస్తుంది. 2024, జూలై 5న, భూమి 1955లో అణు గడియారాలు వచ్చినప్పటి నుండి దాని అతి తక్కువ రోజును 1.66 మిల్లీసెకన్లు 24 గంటల కంటే తక్కువ సమయంలో నమోదు చేసింది.

భూమి భ్రమణ వేగంలో మార్పు అనేక కారణాల వల్ల సంభవించింది. చంద్రుడు - సూర్యుడి అలల ప్రభావం భూమి భ్రమణ వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు, భూమి కోర్-మాంటిల్ మధ్య ఘర్షణ, సముద్రపు నీటి పంపిణీ, హిమానీనదాలు కరగడం, ఈ కారణాలన్నీ కూడా దాని వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కలిసి రోజు కాలాన్ని మారుస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు.

2020 సంవత్సరంలో, శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ ఆవిష్కరణ చేశారు. ఈ నివేదిక భూమి భ్రమణ వేగం తగ్గడానికి బదులుగా పెరుగుతోందని వెల్లడించింది. ఇప్పుడు భూమి గత 50 సంవత్సరాల కంటే వేగంగా తిరుగుతోంది. గతంలో జరిగిన పరిశోధనలలో భూమి భ్రమణ వేగం నెమ్మదిస్తోందని వెల్లడైంది. కానీ ఇప్పుడు ఈ భ్రమణ వేగం పెరుగుతోందని వెలుగులోకి వస్తోంది.

సుమారు 600 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి వేగంగా తిరిగేదని, ఈ కారణంగా దాని భ్రమణ వేగం 21 గంటలు ఉండేదని ఒక శాస్త్రీయ పరిశోధన చెబుతోంది. దీని ప్రకారం, ఆ సమయంలో, భూమి తన అక్షం చుట్టూ తిరగడానికి తక్కువ సమయం తీసుకునేది. శిలాజాలు, పురాతన శిలల అధ్యయనం నుండి శాస్త్రవేత్తలు భూమి భ్రమణ వేగం ప్రతి శతాబ్దంలో 1.8 మిల్లీసెకన్లు తగ్గుతోందని, అందుకే రోజులు ఎక్కువవుతున్నాయని కనుగొన్నారు.




