AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరో ధమాకా సేల్! ఐఫోన్‌పై క్రేజీ డిస్కౌంట్!

రీసెంట్ గానే ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసింది. అయితే ఇప్పుడు దీవాళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివల్ ధమాకా పేరుతో మరో సేల్ మొదలైంది. ఈ సేల్ లో ఐఫోన్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Flipkart sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరో ధమాకా సేల్! ఐఫోన్‌పై క్రేజీ డిస్కౌంట్!
Flipkart Sale
Nikhil
|

Updated on: Oct 06, 2025 | 3:43 PM

Share

ప్రముఖ ఇకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన ఒక రోజులోనే ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్ ను తీసుకొచ్చింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ను మీరు నచ్చిన మొబైల్ కొనలేకపోతే ఈ సేల్ లో ట్రై చేయొచ్చు. ముఖ్యంగా ఈ సేల్ లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రైస్ డిస్కౌంట్ తోపాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ ఆఫర్లు

అక్టోబర్ 4 నుంచి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్ లో ఐఫోన్ 16 పై సుమారు రూ.23 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 16 అసలు ధర రూ.79,990 కాగా ఈ సేల్ లో రూ.  56,999కి లభిస్తుంది. ఇక ఐఫోన్ 16 ప్రో మొబైల్ కూడా తగ్గింపు ఉంది. ఈ మొబైల్ అసలు ధర రూ. 1,19,900 కాగా రూ.85,999 కే అందుబాటులో ఉంది. ఐఫోన్ ప్రో మాక్స్ విషయానికొస్తే దీనిపై కూడా సుమారు రూ.40 వేల వరకూ డిస్కౌంట్ ఉంది. రూ. 1,44,900 అసలు ధర ఉన్న 256జీబీ వేరియంట్ ఇప్పుడు రూ. 1,04,999లకు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై అదనంగా 5% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే సుమారు రూ.4000 వరకూ తగ్గింపు పొందొచ్చు.

ఇవి కూడా..

ఇక ఐఫోన్ తో పాటు శాంసంగ్ ఎస్ 24, మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, శాంసంగ్ ఎస్ 24 ఎఫ్ ఈ, ఒప్పో కె13, వివో టీ4 , రియల్ మీ పీ3ఎక్స్, నథింగ్ ఫోన్ 2 ప్రో, గూగుల్ పిక్సెల్ 9, రియల్ మీ పీ4 , వివో టీ4 ప్రో వంటి మొబైల్స్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ పై ఇన్ స్టంట్ 10% డిస్కౌంట్ లభిస్తుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us