Red Chilli Powder Purity: మీ ఇంట్లో ఉండే కారం పొడి నకిలీదా..? ఒరిజినలా..? ఇలా 2 నిమిషాల్లో తెలుసుకోండి..!
Red Chilli Powder Purity: మార్కెట్లో కారం పొడి కొనేటప్పుడు ఎల్లప్పుడూ నమ్మకమైన బ్రాండ్లను లేదా FSSAI లోగో ఉన్నవాటిని మాత్రమే ఎంచుకోండి. లేబుల్ లేకుండా అమ్మే పొడులను వీలైనంత వరకు వాడకండి. వీలైతే మంచి నాణ్యత గల ఎండు మిరపకాయలను కొని బాగా..

Red Chilli Powder Purity: వంటశాలల్లో కారం పొడి లేకుండా ఏ వంట పూర్తి కాదు. కూరలకు రంగు, రుచిని జోడించడానికి అత్యధికంగా ఉపయోగించే మసాలా దినుసులలో కారం పొడి ఒకటి. రుచికరమైన చేపల కూరల నుండి చికెన్ కూరల వరకు, కారం పొడి రుచిని పెంచుతుంది. గతంలోలాగా మిరపకాయలు కొని వాటిని ఎండబెట్టి, దంచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలామంది వంట కోసం ప్యాకెట్ కారం పొడిని ఉపయోగిస్తారు. అయితే అలాగే కొన్ని మిల్లర్స్ కారం ఎండు మిర్చిన పొడిని పట్టించి విక్రయిస్తుంటారు. నేడు మార్కెట్లో లభించే కారం పొడిలో అధిక కల్తీ ఉన్నట్లు తేలింది. లాభాలను పెంచుకోవడానికి కొందరు మోసగాళ్లు కారం పొడిలో ఇటుక పొడి, సుద్ద పొడి, రంపపు పొడి, ఇంకా ప్రమాదకరమైన కృత్రిమ రంగులను కూడా కలుపుతున్నారు. అలాంటి కల్తీ ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
వీటిని తీసుకున్న తర్వాత కాలక్రమేణా మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. దీనివల్ల గుండెల్లో మంట, అజీర్ణం, కాలేయ, మూత్రపిండాల వ్యాధులు, చివరికి క్యాన్సర్ కూడా రావచ్చు. ఇకపై దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కొనుగోలు చేసే కారం పొడి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.
- నీటి పరీక్ష: కారం పొడిలో ఉండే ఇటుక పొడి, కృత్రిమ రంగులను గుర్తించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. ముప్పావు గ్లాసు శుభ్రమైన నీటిని తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ కారం పొడి వేసి, నెమ్మదిగా పైకి తేలనివ్వండి. మంచి కారం పొడి నీటిలో త్వరగా మునిగిపోదు. అది కాసేపు నీటిపై తేలుతూ ఉంటుంది. ఒకవేళ అది నకిలీదైతే అది త్వరగా గ్లాసు అడుగుకు మునిగి ఒక మందపాటి పొరలా ఏర్పడుతుంది.
- రుద్దండి: కొద్దిగా కారం పొడి తీసుకుని మీ అరచేతుల మధ్య వేళ్ళతో బాగా రుద్దండి. రుద్దినప్పుడు ఆ కారం పొడి మీ చేతులకు గరుకుగా అనిపిస్తే, అందులో ఇటుక పొడి లేదా ఇసుక కలిపి ఉంటారు. మరోవైపు అది చాలా మెత్తగా, సబ్బు పొడిలా జారుడుగా అనిపిస్తే అందులో సబ్బురాయి లేదా సుద్ద పొడి కలిపి ఉండే అవకాశం ఉంది.
- నూనె పరీక్ష: ఒక గిన్నెలో నూనె తీసుకుని అందులో కొద్దిగా కారం పొడి కలపండి. నూనె వెంటనే ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారితే, అందులో కృత్రిమ రంగు కలిపి ఉండే అవకాశం ఉంది. స్వచ్ఛమైన కారం పొడి తన రంగును విడుదల చేయడానికి సమయం తీసుకుంటుంది.
- చెక్క పొడి: ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా కారం పొడి వేసి బాగా కలపండి. కొంత సమయం తరువాత అది చెక్క పొడితో కలిసిన కారం పొడి అయితే, చెక్క రేణువులు నీటిపై తేలుతాయి. స్వచ్ఛమైన కారం పొడి ఈ విధంగా తేలదు.
మార్కెట్లో కారం పొడి కొనేటప్పుడు ఎల్లప్పుడూ నమ్మకమైన బ్రాండ్లను లేదా FSSAI లోగో ఉన్నవాటిని మాత్రమే ఎంచుకోండి. లేబుల్ లేకుండా అమ్మే పొడులను వీలైనంత వరకు వాడకండి. వీలైతే మంచి నాణ్యత గల ఎండు మిరపకాయలను కొని బాగా ఆరబెట్టి మిల్లులో వేసి పొడిగా చేసుకోవడం అత్యంత సురక్షితం.
బరువును పెంచడానికి, రంగును మెరుగుపరచడానికి కొంతమంది అమ్మకందారులు కారం పొడిలో ఇటుక పొడి, సుద్ద పొడి లేదా కృత్రిమ రంగుల వంటి హానికరమైన పదార్థాలను కలుపుతారు. మీ ఇంట్లోనే నకిలీ కారం పొడిని ఎలా గుర్తించాలో పైన చెప్పిన విధంగా తెలుసుకోండి.
ఇది కూడా చదవండి: Government Apps: మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్ ఉన్నాయా? ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




