AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రీమియం AI ల్యాప్‌టాప్‌లతో భారత మార్కెట్లోకి డెల్! XPS 14, XPS 16.. ధర, ఫీచర్లు ఇవే!

డెల్ తన కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్‌లు XPS 14, XPS 16లను భారతదేశంలో విడుదల చేసింది. ఇవి ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌లు, ఆకర్షణీయమైన OLED డిస్‌ప్లేలు, శక్తివంతమైన AI పనితీరుతో వస్తాయి. నిపుణులు, క్రియేటర్ల కోసం రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ. 2 లక్షలు.

ప్రీమియం AI ల్యాప్‌టాప్‌లతో భారత మార్కెట్లోకి డెల్! XPS 14, XPS 16.. ధర, ఫీచర్లు ఇవే!
Dell Xps 14
SN Pasha
|

Updated on: Apr 30, 2026 | 10:52 PM

Share

ప్రీమియం ల్యాప్‌టాప్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో డెల్ భారతదేశంలో తన కొత్త XPS సిరీస్‌ను విడుదల చేసింది. కంపెనీ తాజాగా Dell XPS 14, Dell XPS 16 లను లాంచ్ చేసింది. ఈ రెండు మోడళ్లు నిపుణులు, క్రియేటర్లు, పవర్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. భారత మార్కెట్లో Dell XPS 14 ధర రూ.2,05,990గా ఉండగా, Dell XPS 16 ధర రూ.2,78,550గా నిర్ణయించారు. వినియోగదారులు వీటిని డెల్ అధికారిక వెబ్‌సైట్, ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, ఎంపిక చేసిన రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా HDFC, SBI, ICICI వంటి బ్యాంక్ కార్డులపై రూ.15,000 వరకు డిస్కౌంట్, నో-కాస్ట్ EMI సదుపాయం కూడా అందిస్తున్నారు.

ఈ రెండు ల్యాప్‌టాప్‌లు సరికొత్త ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌లతో వస్తాయి. ఇందులో AI పనితీరు కోసం ప్రత్యేకంగా రూపొందించిన NPU (న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్) ఉండటంతో 50 TOPS వరకు AI సామర్థ్యం అందించగలవు. 32GB LPDDR5x RAM, 1TB SSD స్టోరేజ్‌తో వేగవంతమైన మల్టీటాస్కింగ్ సాధ్యమవుతుంది. డిస్‌ప్లే విషయంలో XPS 14లో 14-అంగుళాల 2.8K OLED స్క్రీన్, XPS 16లో 16-అంగుళాల 3.2K OLED టచ్ డిస్‌ప్లే ఉంది. రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Vision సపోర్ట్ అందించారు.

బ్యాటరీ విషయానికి వస్తే 70Wh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 7, Bluetooth 6.0, మూడు Thunderbolt 4 పోర్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం CNC అల్యూమినియం బాడీ, హాప్టిక్ టచ్‌ప్యాడ్, డాల్బీ అట్మాస్ ఆడియోతో ఈ ల్యాప్‌టాప్‌లు హై-ఎండ్ సెగ్మెంట్‌లో డెల్ కొత్త తరం AI శక్తిని ప్రతిబింబిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us