Climate Change: పక్షుల రెక్కలు పెరగడం.. తగ్గడంపై వాతావరణ మార్పుల ప్రభావం.. పరిశోధనలలో సంచలన విషయాలు

Climate Change: పక్షులపై వాతావరణ మార్పుల ప్రభావంపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను సైతం వారు విడుదల చేశారు. పక్షులపై చేసిన..

Climate Change: పక్షుల రెక్కలు పెరగడం.. తగ్గడంపై వాతావరణ మార్పుల ప్రభావం.. పరిశోధనలలో సంచలన విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Nov 22, 2021 | 11:47 AM

Climate Change: పక్షులపై వాతావరణ మార్పుల ప్రభావంపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను సైతం వారు విడుదల చేశారు. పక్షులపై చేసిన పరిశోధనలలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యమైన అమెజాన్‌లో శాస్త్రవేత్తలు పరిశోధన ప్రకారం.. వాతావరణ మార్పు పక్షులపై ఎలా ప్రభావితం చేస్తోంది..? ఎన్ని జాతులు దానితో పోరాడుతున్నాయి..? ఇలాంటి అనేక విషయాలు సమాధానం రాబట్టారు శాస్త్రవేత్తలు. పక్షులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గుర్తించేందుకు కాలిఫోర్నియాలోని ఇంటిగ్రల్‌ ఎకాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పక్షి జాతుల శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. శరీరం పొట్టిగా, రెక్కలు పొడవుగా మారుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వేడిని నివారించడానికి పక్షులు తమ శరీరాలను సిద్ధం చేసుకుంటున్నాయని, పొట్టి శరీరం వేడి నుంచి రక్షించడానికి సహాయపడుతుందని గుర్తించారు. అలాగే పొడవాటి రెక్కలు ఎక్కువ సేపు ఎగరడానికి సహాయపడతాయి. వాతావరణ మార్పుల కారణంగా చిలుక ముక్కు కూడా పెరుగుతుందని ఆస్త్రేలియాలోని డీకిన్‌ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలలో తేలింది. ఈ మార్పుల కారణంగా ఈ జాతులు ఎక్కువగా ప్రభావితామవుతాయి. అమెజాన్‌ అడవుల్లో మొత్తం 77 జాతుల పక్షులపై పరిశోధన జరిపారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ ప్రభావితమైన పక్షులలో గోల్డెన్‌-క్రౌన్‌ స్పేడ్‌బిల్‌, గ్రే యాంట్‌వ్రెన్‌, మెక్‌కన్నెల్స్‌, ఫ్లైక్యాచర్‌, డస్కీ-థ్రోటెడ్‌ యాంట్‌ష్రీక్‌ ఉన్నాయి.

తగ్గుతున్న శరీర బరువు: శాస్త్రవేత్తలు విడుదల చేసిన నివేదికల ప్రకారం.. 1980 తర్వాత పక్షుల బరువులో 20 శాతం తగ్గుదల కూడా నమోదైనట్లు గమనించారు. వేసవిలో భవిష్యత్తులో తమను తాము ఎంత వరకు రక్షించుకోగలరన్నది పెద్ద ప్రశ్నే అంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులను ఆపడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇవి కూడా చదవండి:

Octopus: అక్టోపస్‌ జీవి గురించి తెలుసా..? అన్ని ప్రత్యేకతలే.. దీనికి 9 మెదడులు.. 3 హృదయాలు.. ఇంకా మరెన్నో..!

Computer Keyboard: కీ బోర్డుపై ABCDలు వరుస క్రమంలో ఎందుకు ఉండవు..? అసలు కారణం ఏంటి..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే