AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covishield Vaccine: సీరం సంస్థ విన్నపానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసుల ఎగుమతి..

Serum Institute of India: కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి.. వ్యాక్సిన్ అందని దేశాలకు సహాయం

Covishield Vaccine: సీరం సంస్థ విన్నపానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసుల ఎగుమతి..
Covishield
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2021 | 9:55 AM

Share

Serum Institute of India: కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి.. వ్యాక్సిన్ అందని దేశాలకు సహాయం చేసేందుకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యాక్సిన్ అందని దేశాలకు బాసటగా నిలచేందకు ఐరాస ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యాక్సిన్లను సేకరించిన పేద దేశాలకు సహాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఐక్య రాజ్యసమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో భారత ఫార్మ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ డోసుల స్టాక్ పెరిగిపోయినందువల్ల.. యూఎన్ కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా పలు దేశాలకు డోసులను సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను నాలుగు దేశాలకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఎగుమతికి అనుమతినిచ్చిందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్ నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌, బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నట్లు తెలిపాయి.

పుణెకు చెందిన సీరం సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)లోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవల తెలిపింది. వాటిని వేగంగా పంపిణీ చేయకుంటే మా కంపెనీకి శీతల గిడ్డంగులు, మానవ వనరుల పరమైన అవాంతరాలు ఎదురవుతాయని.. కావున ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ‘కోవ్యాక్స్‌’ కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, తజికిస్తాన్‌, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి మంజూరు చేయాలని కోరింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి అనుమతిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాగా.. అంతకుముందు భారత ప్రభుత్వం ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌లకు 10 లక్షల చొప్పున కోవిషీల్డ్ డోస్‌లను ఎగుమతి చేయడానికి సీరం ఇనిస్టిట్యూట్ కు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:

Viral Video: కోతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. కానీ వానరం ఏం చేసిందో చూస్తే షాకే.. వీడియో వైరల్

India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు.. 534 రోజుల తర్వాత భారీగా పతనం..