Smart TVs under 15K: తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్ టీవీలు.. సూపర్ ఫీచర్లు.. తిరుగులేదంతే..
మార్కెట్లో అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో బెస్ట్ టీవీని ఎంచుకొని కొనుగోలు చేయడం కష్టసాధ్యమైంది. పైగా మనకు అనువైన ధరలో బెస్ట్ టీవీని ఎంపిక చేసుకోవడం ఇంకా ఇబ్బంది. ఈ నేపథ్యంలో రూ. 15,000లోపు ధరలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీలను మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి..

ఇటీవల కాలంలో ఇంట్లో వినోదానికి ప్రాధాన్యం పెరిగింది. ఓటీటీల రాకతో అందరూ ఇంట్లోనే మంచి స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో బెస్ట్ టీవీని ఎంచుకొని కొనుగోలు చేయడం కష్టసాధ్యమైంది. పైగా మనకు అనువైన ధరలో బెస్ట్ టీవీని ఎంపిక చేసుకోవడం ఇంకా ఇబ్బంది. ఈ నేపథ్యంలో రూ. 15,000లోపు ధరలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీలను మీకు పరిచయం చేస్తున్నాం. వీటిల్లో అధిక ధరల్లో లభించే హై ఎండ్ మోడళ్లలో లభించే ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు, ఆకట్టుకునే విధంగా నాణ్యమైన డిస్ ప్లే ను కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి కాస్త చిన్న పరిమాణంలో ఉన్న ఈ టీవీలు లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లకు చక్కగా సరిపోతాయి.
హ్యుందాయ్ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ..
ఈ టీవీ హెచ్‌డీ రెడీ డిస్ ప్లేతో పాటు స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఏ ప్లస్ గ్రేడ్ డీఎల్ఈడీ ప్యానల్ విస్తృత వీక్షణ కోణాల నుండి ప్రకాశవంతమైన, స్ఫుటమైన విజువల్స్‌ను అందిస్తుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ చలనాన్ని సున్నితంగా ఉంచుతుంది. డ్యూయల్ హెచ్డీఎంఐ పోర్ట్‌లు, యూఎస్బీ పోర్ట్‌లు, వైఫై కనెక్టివిటీ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 20వాట్ల స్పీకర్లు మంచి ఆడియోను అందిస్తాయి. ఒక జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. టీవీలో హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ వంటి మరిన్ని యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
ఏసర్ 32 అంగుళాల ఐ సిరీస్ హెచ్‌డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ..
ఈ టీవీ ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 178 డిగ్రీల వీక్షణ కోణం ఉంటుంది. ఇది స్ట్రీమింగ్ అవసరాలకు అనుగుణంగా అన్ని స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. రూ. 15,000లోపు ధరలో ఇది బెస్ట్ ఎంపిక. వాయిస్-ఎనేబుల్ రిమోట్ ఉంటుంది. ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా నెట్ ఫ్లిక్స్, యూ ట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి యాప్ లను యాక్సెస్ చేయొచ్చు. ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్, బ్లూటూత్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, డాల్బీ ఆడియో ద్వారా ఆధారితమైన 24 వాట్ల సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. 1.5జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్ మృదువైన స్ట్రీమింగ్, గేమింగ్‌ను నిర్ధారిస్తుంది.
హ్యూడీ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ..
హెచ్‌డీ రిజల్యూషన్ తో గదిలోని ఏ సీటు నుంచి అయినా స్పష్టమైన చిత్రం కోసం విస్తృత 178-డిగ్రీల వీక్షణ కోణాలను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 9 ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ వంటి మీకు ఇష్టమైన అన్ని స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. 8జీబీ ర్యామ్, 1జీబీ జీపీయూ యాప్‌లు, మెనూల మధ్య సున్నితమైన నావిగేషన్‌ను నిర్ధారిస్తాయి. డ్యూయల్ హెచ్ డీఎంఐ, యూఎస్బీ పోర్టులు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ 20వాట్ల స్పీకర్లు మంచి ఆడియోను అందిస్తాయి. మీరు మీ హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడానికి 3ఎంఎం ఆడియో జాక్ ఇచ్చారు.
వీడబ్ల్యూ 32 అంగుళాలు ఫ్రేమ్‌లెస్ సిరీస్ హెచ్‌డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ..
సరసమైన ధరలో లభించే ఫ్రేమ్‌లెస్ 32-అంగుళాల ఎల్ఈడీ టీవీ ఇది. ఈ టీవీ స్లిమ్, స్పేస్ ఆదా చేసే డిజైన్ లో ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ హెచ్‌డీ చిత్ర నాణ్యతను అందిస్తుంది. విస్తృత 178 డిగ్రీల వీక్షణ కోణం అన్ని వైపుల నుంచి మంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో మీ పరికరాలను వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మిర్రరింగ్‌తో నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ నుంచి కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌కి ప్రసారం చేయొచ్చు. 20 వాట్ స్టీరియో స్పీకర్లు లీనమయ్యే ధ్వనిని అందిస్తాయి.
ఎంఐ 32 అంగుళాలు ఏ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ..
ఈ టీవీలో ఇన్ బిల్ట్ గూగుల్ టీవీ ప్లాట్ ఫారం ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్ తో నడుస్తుంది. యూ ట్యూబ్,నెట్ ఫ్లిక్స్ వంటి 7,000 యాప్ ల కంటే ఎక్కువ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, క్రోమ్ కాస్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. హెచ్ డీ రిజల్యూషన్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ పదునైన, స్పష్టమైన చిత్రాలను అందిస్తాయి. 20 వాట్ స్పీకర్లు, డాల్బీ ఆడియో లీనమయ్యే వీక్షణ అనుభవం కోసం సరౌండ్ సౌండ్‌ను అందిస్తాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..