శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌ !!

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌ !!

Phani CH

|

Updated on: Dec 18, 2023 | 7:24 PM

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్ని కేంద్రం హై- అలర్ట్‌ జారీ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, వెంటనే తమ ఫోన్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. శాంసంగ్‌ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌నులో లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ (CERT-In) సూచించింది.

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్ని కేంద్రం హై- అలర్ట్‌ జారీ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, వెంటనే తమ ఫోన్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. శాంసంగ్‌ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌నులో లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ (CERT-In) సూచించింది. శాంసంగ్‌ లేటెస్ట్‌ ఫోన్లు అయిన గెలాక్సీ ఎస్‌23, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 5 సహా ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14తో పనిచేసే డివైజుల్లో ఈ లోపం ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. కాబట్టి యూజర్లు ఫోన్‌ సెట్టింగ్స్‌లోని అబౌట్‌ డివైజ్‌లోకి వెళ్లి లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని యూజర్లకు సెర్ట్‌-ఇన్‌ సూచించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఫోన్‌ అప్‌డేట్ చేసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్‌ చేయవద్దని సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు దుప్పటి కప్పుకున్న మన్యం జిల్లా.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

రైతన్నలను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు