Smart Phones: జూన్‌లో మార్కెట్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర.. పది వేలలోపు ది బెస్ట్ ఇవే
భారతదేశంలో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వాడేందుకు ఇష్టపడుతున్నారు. దేశ జనాభాలో ఎక్కువ శాతం మంది మధ్యతరగతి ప్రజలు ఉండడంతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ బాగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీ రూ.10 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ నెలలో రూ.10 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో అనేక కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ ఫోన్‌లు ప్రాథమిక పనితీరు, అతిపెద్ద బ్యాటరీలు, 5జీ మద్దతుతో యువతను అధికంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్‌లు ప్రీమియం లేదా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడకపోయిన సగటు యూజర్‌కు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. ఈ నేపథ్యంలో టాప్ ఫోన్ల గురించి మరిన్ని వివరాలపై ఓ లుక్కేద్దాం.
లావా బోల్డ్ ఎన్1 ప్రో
లావా బోల్డ్ ఎన్1 ప్రో ఫోన్ యూనిసాక్ టీ606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 4 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50 ఎంపీ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా, స్క్రీన్ ఫ్లాష్‌తో కూడిన 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 6,699. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇండియాలో కొనుగోలు అందుబాటులో ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ
ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందే ఈ ఫోన్ 8 జీబీ 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 48 ఎంపీ సోనీ ఐఎంఎక్ష్ 582 ప్రైమరీ సెన్సార్, డెప్త్ సెన్సార్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 ఎంపీ ఫ్రంట్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఈ ఫోన్ ప్రత్యేకత. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ ధర 9,499గా ఉంది.
రియల్‌మి నార్జో ఎన్63
రియల్‌మి నార్జో ఎన్63 ఫోన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఐపీ-54 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50 ఎంపీ ఏఐ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 8,499.
రెడ్‌మీ ఏ4
ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఉపయోగిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ యూఎస్‌బీ టైప్ సీ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 4 జీబీ+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర రూ. 8,498గా ఉంది.
పోకో ఎం6
పోకో ఎం6 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌సెట్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో శక్తిని పొందుతుంది. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉంటుంది. కెమెరా ఔత్సాహికుల కోసం ఈ ఫోన్‌లో 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ను రూ. 10,499కే సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేక సేల్స్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లతో రూ.10 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



