Elon Musk Starlink: భారత్‌కు స్టార్‌లింక్ ఎప్పుడు వస్తుంది? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి!
Elon Musk Starlink: ఎలోన్ మస్క్ ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రాజెక్టుకు ఆపరేటింగ్ లైసెన్స్ ఆమోదం త్వరలో లభించనుందని కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ఇప్పటికే స్టార్‌లింక్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) జారీ చేసిందని..

Elon Musk Starlink Satellite: ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ భారతదేశానికి వస్తుందని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. భారతదేశంలో స్టార్‌లింక్ ప్రారంభం గురించి చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై క్లారిటీ ఇచ్చారు. స్టార్‌లింక్ భారతదేశంలో ఎప్పుడు వస్తుంది? దీని గురించి సింధియా ఏం చెప్పారు? ఒక వేళ అందుబాటులోకి వస్తు దీని ధర ఎంత? తదితర వివరాలు తెలుసుకుందాం.
ఎలోన్ మస్క్ ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రాజెక్టుకు ఆపరేటింగ్ లైసెన్స్ ఆమోదం త్వరలో లభించనుందని కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ఇప్పటికే స్టార్‌లింక్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) జారీ చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఇండియన్ నేషనల్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి తుది ఆమోదం కోసం మాత్రమే వేచి ఉంది.
ఇది కూడా చదవండి: ఆవేశంగా శోభనం గదిలోకి వెళ్లిన వరుడు.. అక్కడి సీన్ చూసి అవాక్ అయ్యాడు.. ఆ తర్వాత బోరున ఏడ్చాడు
ప్రస్తుతం రెండు కంపెనీలు వన్ వెబ్, రిలయన్స్ ఉపగ్రహ కనెక్టివిటీ కోసం లైసెన్స్‌లను పొందాయని కేంద్ర మంత్రి అన్నారు. స్టార్‌లింక్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. ఎల్‌ఓఐ జారీ చేసిన, స్టార్‌లింక్ త్వరలో లైసెన్స్ పొందుతుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.
భారతదేశంలో స్టార్‌లింక్ ధర ఎంత ఉంటుంది?
ET నివేదిక ప్రకారం.. SpaceX భారతదేశంలో తన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించనుంది. ప్రారంభ ప్రమోషనల్ ఆఫర్ నెలకు $10 కంటే తక్కువ (సుమారు రూ. 840) నుండి అపరిమిత డేటా ప్లాన్‌లను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: IRCTC: ప్రయాణికులకు అలర్ట్.. ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం.. ఇలా చేయకపోతే తత్కాల్ టికెట్స్ బుక్ చేయలేరు
స్టార్‌లింక్ ఈ చౌకైన ప్లాన్ భారతదేశంలో కస్టమర్లను త్వరగా తీసుకురానుంది. ఇది దాని పోటీదారులైన వన్‌వెబ్, రిలయన్స్ జియో, గ్లోబల్‌స్టార్ వంటి వాటిపై పోటీ పడనుంది. ఈ కంపెనీలన్నీ భారతదేశంలో తమ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.
స్టార్‌లింక్ అంటే ఏమిటి?
స్టార్‌లింక్ అనేది స్పేస్‌ఎక్స్ కంపెనీ ప్రాజెక్ట్. ఇది మొత్తం ప్రపంచానికి హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భూమి దిగువ కక్ష్యలో వందలాది చిన్న ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది. స్టార్‌లింక్ సేవ సాంప్రదాయ ఉపగ్రహ ఇంటర్నెట్ కంటే వేగవంతమైనది. నమ్మదగినది. ఎందుకంటే దాని ఉపగ్రహాలు భూమికి చాలా దగ్గరగా ఉంటాయి.
ఈ సాంకేతికత ముఖ్యంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో ఫైబర్ నెట్‌వర్క్‌లు లేదా మొబైల్ టవర్లు చేరుకోలేని ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలలో కూడా వేగవంతమైన, స్థిరమైన ఇంటర్నెట్‌ను అందించడం స్టార్‌లింక్ లక్ష్యం.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా…? ఇలా చెక్ చేసుకోండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








