ఆవేశంగా శోభనం గదిలోకి వెళ్లిన వరుడు.. అక్కడి సీన్ చూసి అవాక్ అయ్యాడు.. ఆతర్వాత బోరున ఏడ్చాడు
ఒక యువకుడు తన వివాహం తర్వాత ఫస్ట్ నైట్ రోజున ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గదిలోకి వెళ్లాడు. కానీ కొంత సమయానికి అతని ముఖంలో ఆ మరుపురాని క్షణం ఆవిరైపోయింది. ముఖంలో సంతోషం కనిపించలేదు. పైగా గది నుంచి బిగ్గరగా అరుస్తూ బయటకు వచ్చాడు. అతని

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వయసు వచ్చిందంటే చాలు వాహనం ఎంతో ముఖ్యం. ఇక వివాహం అయిన తర్వాత మరుపురాని క్షణం తొలి రాత్రి. పెళ్లి అయిన తర్వాత వారి జీవితంలో ఈ క్షణం ఎప్పటికి గుర్తిండిపోయే క్షణం. యువకుడు వివాహం అయిన తర్వాత ఎన్నో కలలు కంటుంటాడు. అలాంటి ఈ మరుపురాని క్షణం ఓ యువకుడినికి జీవితంలో మర్చిపోలేని విధంగా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రాలో ఒక యువకుడు తన వివాహం తర్వాత ఫస్ట్ నైట్ రోజున ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గదిలోకి వెళ్లాడు. కానీ కొంత సమయానికి అతని ముఖంలో ఆ మరుపురాని క్షణం ఆవిరైపోయింది. ముఖంలో సంతోషం కనిపించలేదు. పైగా గది నుంచి బిగ్గరగా అరుస్తూ బయటకు వచ్చాడు. అతని ముఖంలో భయం, ఆందోళన కనిపించింది. ఏం జరిగిందోనని ఇంట్లో వాళ్లందరు గబరా పడ్డారు. ఈ ఘటన సోన్‌భద్రలోని భభాని పోలీస్ స్టేషన్ పరిధిలో మే 27న చోటు చేసుకుంది.
వధువు అదృశ్యం:
ఇదిలా ఉండగా, వివాహం జరిగిన కొన్ని గంటలకే వధువు అదృశ్యమైపోయింది. పెళ్లి తర్వాత తన భార్యతో మొదటి రాత్రి జరుపుకోవడానికి వరుడు ఉత్సాహంగా గదికి వెళ్ళాడు. వరుడు గదిలోకి అడుగుపెట్టగానే పెళ్లి కూతురు నాకో చిన్న పని ఉంది.. దానిని పూర్తి చేసుకుని వస్తాను అంటూ వెళ్లిపోయింది. గది నుంచి వెళ్లిపోయిన ఆమె ఎంతకీ తిరిగి రాలేదు. వరుడు వస్తుందని ఎంతగానో ఎదురు చూశాడు. ఆమె ఎంతకి తిరిగి రాకపోవడంతో వరుడి టెన్షన్‌తో అరుస్తూ బయటకు వచ్చాడు. చివరి ఏం జరిగిందోనన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.పెళ్లైన కొన్ని గంటలకే తన ప్రియుడితో కలిసి వధువు బైక్ పై పారిపోయిందని తెలుసుకున్నారు.
పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు..
ఇది జరిగిన వెంటనే వరుడి కుటుంబ సభ్యులు వెంటనే పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అప్పుడు రెండు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇంతలో, వధువు ఆమె ప్రియుడు గొడవ గురించి తెలుసుకున్న తర్వాత ఆమె ప్రియుడు ఆమెను తల్లిదండ్రుల ఇంటికి తిరిగి పంపించాడు. తర్వాత అమ్మాయి ప్రియుడితోనే కలిసి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటానని తెగేసి చెప్పింది.
ఇరు వర్గాల మధ్య పంచాయితీ:
ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత మూడు గ్రామల పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య పంచాయితీ జరిగింది. ఇందులో ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. వరుడు దాదాపు మూడు లక్షల రూపాయల వివాహ ఖర్చులను భరించాలని, అప్పుడే అమ్మాయిని తీసుకుని వెళ్లవచ్చని షరతు విధించారు. అంతేకాదు అదనంగా, వరుడి వైపు నుండి అందుకున్న వస్తువులను కూడా ప్రేమికుడికి అప్పగించాలని నిర్ణయించారు. కొత్త పెళ్లికొడుకు అతని కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. ఇంతర పెద్ద మొత్తాన్ని తాము భరించలేమని చెప్పారు. చివరికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వరుడి తరపు వారు ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌లో నివేదిస్తామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








