AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ఐపీఎల్‌ సీజన్‌లో అంబానీ జియో హాట్‌స్టార్ ద్వారా ఎంత సంపాదించారు?

Mukesh Ambani: ప్రజలు మ్యాచ్ చూడటానికి జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తారు. దీని వల్ల జియో హాట్‌స్టార్ సంపాదిస్తుంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ద్వారా ఆదాయం పెరగడం వల్ల ముఖేష్ అంబానీకి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల నుండి మాత్రమే కాకుండా మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో..

Mukesh Ambani: ఐపీఎల్‌ సీజన్‌లో అంబానీ జియో హాట్‌స్టార్ ద్వారా ఎంత సంపాదించారు?
Subhash Goud
|

Updated on: Jun 04, 2025 | 8:19 AM

Share

Ambani jiohotstar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 చివరి మ్యాచ్ జూన్ 3న నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఐపిఎల్ 2025 బిసిసిఐ జేబులను నింపడమే కాకుండా జియో హాట్‌స్టార్ వంటి ప్రసారకర్తలను కూడా డబ్బుతో నింపుతుంది. ఈ సంవత్సరం 64.3 కోట్ల మంది ప్రేక్షకులు ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదించారు.

గత సంవత్సరం 60.2 కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు జియో సినిమాలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూశారు. అంటే ఈసారి గత సంవత్సరం రికార్డు కూడా బద్దలైంది. ఇప్పుడు జియో సినిమా, హాట్‌స్టార్ విలీనం తర్వాత ఈ సంవత్సరం కోట్లాది మంది జియో హాట్‌స్టార్‌లో పీబీకేఎస్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఆస్వాదించారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ క్రేజ్ ముఖేష్ అంబానీ జేబులను నింపింది. హాట్‌స్టార్, జియో సినిమా విలీనం తర్వాత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో హాట్‌స్టార్‌లో 63.16 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో 46.82 శాతం వయాకామ్ 18 ద్వారా, 16.34 శాతం ప్రత్యక్ష వాటా. ఫైనల్ మ్యాచ్ సమయంలో విపరీతమైన వీక్షకుల సంఖ్య కారణంగా కంపెనీ షేర్లు పెరగవచ్చు.

ముఖేష్ అంబానీ ఎలా సంపాదిస్తాడు?

ప్రజలు మ్యాచ్ చూడటానికి జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తారు. దీని వల్ల జియో హాట్‌స్టార్ సంపాదిస్తుంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ద్వారా ఆదాయం పెరగడం వల్ల ముఖేష్ అంబానీకి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల నుండి మాత్రమే కాకుండా మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో చూపించే ప్రకటనల నుండి కూడా చాలా డబ్బు వస్తుంది. 2025 ఐపీఎల్ సీజన్‌లో రిలయన్స్ జియోస్టార్ (JioStar), డిస్నీ, రిలయన్స్ వయాకామ్18 సంయుక్త సంస్థ, టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను కలిగి ఉంది. ఈ సీజన్‌లో జియోస్టార్ మొత్తం రూ. 6,000-7,000 కోట్ల మధ్య ప్రకటన ఆదాయాన్ని సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖేష్ అంబానీ 6000 కోట్లు సంపాదించారా?

సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల ప్రకటనను చూపించడానికి 18 నుండి 19 లక్షలు వసూలు చేస్తారు. కానీ ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈసారి ఫీజులు 20 నుండి 30 శాతం పెరగవచ్చని మీడియా నివేదికలలో ప్రస్తావణ వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభానికి ముందు ఈ సంవత్సరం ముఖేష్ అంబానీ ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ప్రకటనలను చూపించడం ద్వారా రూ. 6000 కోట్లకుపైగా సంపాదించవచ్చని చాలా చర్చ జరిగింది. మ్యాచ్ సమయంలో మీరు చూసే ప్రకటనలను చూపించడానికి బ్రాడ్‌కాస్టర్ (జియో హాట్‌స్టార్) కంపెనీల నుండి చాలా డబ్బు వసూలు చేస్తుంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత, ఈ సంవత్సరం మ్యాచ్ సమయంలో ప్రజలకు ప్రకటనలను చూపించడం ద్వారా ముఖేష్ అంబానీ ఎంత డబ్బు సంపాదించారో సమాచారం బయటకు రావచ్చు, కానీ ప్రస్తుతం ఐపీఎల్‌లో ప్రకటనలను చూపించడం ద్వారా ముఖేష్ అంబానీ ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించారో అధికారిక సమాచారం లేనప్పటికీ.. వేల కోట్లల్లో ఉంటుందని భావిస్తున్నారు.

  • ప్రకటన ఆదాయం: జియోస్టార్ ఐపీఎల్ 2025 కోసం రూ. 4,500 కోట్ల ప్రకటన ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత సంవత్సరం రూ. 3,900 కోట్లతో పోలిస్తే 15% పెరుగుదల.
  • సబ్‌స్క్రిప్షన్ ఆదాయం: జియోసినిమా కొత్త OTT సబ్‌స్క్రిప్షన్ ప్యాక్ ద్వారా 100 రోజుల్లో 150 లక్షల చెల్లింపు సభ్యులను చేరుకుంది.
  • ప్రకటన ధరలు: 10 సెకన్ల ప్రకటనల ధరలు రూ. 18-19 లక్షలుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరం రూ. 16.4 లక్షలతో పోలిస్తే 9-15% పెరుగుదల.
  • ప్రేక్షకుల సంఖ్య: జియోసినిమా ఐపీఎల్ 2024లో 62 కోట్ల భారతీయులను చేరుకుంది. ఇది 38% పెరుగుదల.
  • సంస్థల భాగస్వామ్యాలు: జియోస్టార్ 12 ప్రధాన స్పాన్సర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో SBI, కోకా-కోలా, ఫోన్‌పే, అమూల్, క్యాంపా, మై11సర్కిల్, జాక్వార్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ మొత్తం ఆదాయం, జట్టు స్పాన్సర్షిప్‌లు, ప్రత్యక్ష ప్రదర్శనలు, ఇతర వాణిజ్య ఒప్పందాలను కలిపి, ఐపీఎల్ 2025 మొత్తం వాణిజ్య ఆదాయం రూ. 6,000-7,000 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి