AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Gas Leak Scam: ఏసీ గ్యాస్ లీక్ స్కామ్ గురించి మీకు తెలుసా..? ఇవి తప్పకుండా తెలుసుకోండి!

AC Gas Leak Scam: కొన్నిసార్లు గ్యాస్ లీకేజీలు నిజమైనవి. అలాగే గ్యాస్ రీఫిల్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్‌ లీక్‌ కాకపోతే సర్వీస్ పర్సన్ గ్యాస్ రీఫిల్ చేసినట్లు నటించి మీ నుండి డబ్బు తీసుకుంటాడు. ఇదో రకమైన మోసం. చాలా మందికి దీని గురించి తెలియదు..

AC Gas Leak Scam: ఏసీ గ్యాస్ లీక్ స్కామ్ గురించి మీకు తెలుసా..? ఇవి తప్పకుండా తెలుసుకోండి!
Subhash Goud
|

Updated on: Jun 03, 2025 | 1:59 PM

Share

వేసవిలో చాలా మంది ఏసీ వాడతారు. ఎయిర్‌ కండీషనర్‌ వాడాలంటే, దానిని సర్వీసింగ్ చేయాలి. తరచుగా AC రిపేర్ చేసేవారు ఏసీలో గ్యాస్ లీక్ అయిందని, దానిని తిరిగి నింపాలని చెబుతారు. ఏసీ గ్యాస్ లీక్ స్కామ్ ఇక్కడే మొదలవుతుంది. చాలా మందికి దీని గురించి తెలియదు. దాని గురించి తెలుసుకుందాం.

ఏసీ గ్యాస్ లీక్ స్కామ్ అంటే ఏమిటి?

ఏసీ గ్యాస్ లీక్ స్కామ్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా మీరు మీ ఇంటి ACని సర్వీస్ చేయవలసి వచ్చినప్పుడు మీరు స్థానిక లేదా కంపెనీ సర్వీస్ వ్యక్తికి కాల్ చేస్తారు. అతను ఏసీని శుభ్రం చేసి, తర్వాత గ్యాస్ లీక్ అయిందని చెబుతాడు. గ్యాస్ రీఫిల్ చేయడానికి ఎంత ఖర్చవుతుందని మీరు అడుగుతారు. దీని తర్వాత సర్వీస్ వ్యక్తి ఒక మొత్తాన్ని కోట్ చేస్తాడు. మీరు కొంచెం బేరం చేసి, ఆపై అంగీకరిస్తారు. సర్వీస్ వ్యక్తి గ్యాస్ రీఫిల్ చేసి మీ నుండి డబ్బు తీసుకుంటాడు.

ఇవి కూడా చదవండి

కొన్నిసార్లు గ్యాస్ లీకేజీలు నిజమైనవి. అలాగే గ్యాస్ రీఫిల్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్‌ లీక్‌ కాకపోతే సర్వీస్ పర్సన్ గ్యాస్ రీఫిల్ చేసినట్లు నటించి మీ నుండి డబ్బు తీసుకుంటాడు. ఇదో రకమైన మోసం. చాలా మందికి దీని గురించి తెలియదు. అలాగే దీని గురించి పెద్దగా పట్టించుకోరు. దీని కారణంగా సర్వీస్ పర్సన్ ఏసీలో గ్యాస్ రీఫిల్ చేయకుండా వారి నుండి డబ్బు తీసుకుంటారు.

ఈ మోసాన్ని ఎలా నివారించాలి?

దీన్ని నివారించడానికి ఒకే ఒక మార్గం ఉంది. మీ ఏసీ సరిగ్గా పనిచేయడానికి, మంచి కూలింగ్‌ను అందించడానికి ఎంత గ్యాస్ ప్రెజర్ అవసరమో మీరు తెలుసుకోవాలి. ఇది వివిధ టన్నుల ఏసీలలో మారుతూ ఉంటుంది. 1.5 టన్నుల ఏసీ గురించి తెలుసుకోండి.

సర్వీస్ పర్సన్ వచ్చినప్పుడు AC ఆన్ చేసి, AC నడుస్తున్నప్పుడు దాని గ్యాస్ ప్రెజర్ గురించి అడగండి. తర్వాత AC ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా గ్యాస్ ప్రెజర్ గురించి అడగండి. రెండు రీడింగ్‌లను పొందిన తర్వాత పైన ఇచ్చిన పట్టికతో వాటిని పోల్చండి. ప్రెజర్ పైన పేర్కొన్న విలువ చుట్టూ ఉంటే, మీకు గ్యాస్ రీఫిల్ అవసరం లేదు. ఇది సర్వీస్ పర్సన్‌కు AC సరైన గ్యాస్ ప్రెజర్ మీకు తెలుసని భావిస్తాడు. అతను మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించడు. ఇలాంటివి కొన్ని టెక్నికల్‌గా ముందుగానే తెలిసి ఉంటే మోసపోకుండా ఉండవచ్చు. లేకుంటే ఏసీ టెక్నీషియన్‌ చేతిలో మోసపోవాల్సి ఉంటుంది.

Ac

మీరు AC గ్యాస్‌ను ఈ విధంగా తనిఖీ చేయవచ్చు:

  • మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు చల్లబడకపోతే, గ్యాస్ అయిపోయిందని అర్థం.
  • కంప్రెసర్‌ను తనిఖీ చేయండి. కంప్రెసర్ ప్రారంభమైనప్పటికీ చల్లని గాలి రాకపోతే AC లోని గ్యాస్ అయిపోయిందని అర్థం.
  • నీటి పైపుపై మంచు ఉంటే, AC లోని గ్యాస్ అయిపోయిందని కూడా సూచిస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్