Jio Air Fiber: జియో ఎయిర్‌ఫైబర్‌తో ఆ సమస్యకు చెక్.. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మధ్య ప్రధాన తేడాలివే..!
రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ పేరుతో మరో కొత్త సర్వీస్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 19, 2023న జియో ఎయిర్‌ఫైబర్ అనే కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేవ గృహాలు, కార్యాలయాల కోసం రూపొందించబడిన పోర్టబుల్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌గా కంపెనీ పేర్కొంటుంది. జియో ఎయిర్ ఫైబర్ ద్వారా గరిష్టంగా 1.5 జీబీ వేగంతో డేటాను ఆశ్వాదించవచ్చు. గణేష్ చతుర్థి రోజున జియో ఎయిర్ ఫైబర్ అధికారికంగా అందుబాటులోకి వస్తుందని జియో ప్రతినిధులు పేర్కొంటున్నారు.

టెలికాం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన ప్రభంజనం అంత ఇంతా కాదు. జియో దెబ్బకు చాలా టెలికాం కంపెనీలు మూతబడ్డాయి. మరికొన్ని టెలికాం కంపెనీలు ఒకదానితో మరొకటి జతకట్టాయి. ముఖ్యంగా జియో కారణంగానే సగటు వినియోగదారుడి డేటా ధరలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాపార విస్తరణలో భాగంగా జియో ఇంటింటికీ నెట్ అందించాలనే లక్క్ష్యంతో జియో ఫైబర్ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకే ఈ సేవలను అందుబాటులో ఉన్నాయి. క్రమేపీ గ్రామీణులకు కూడా ఈసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ పేరుతో మరో కొత్త సర్వీస్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 19, 2023న జియో ఎయిర్‌ఫైబర్ అనే కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేవ గృహాలు, కార్యాలయాల కోసం రూపొందించబడిన పోర్టబుల్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌గా కంపెనీ పేర్కొంటుంది. జియో ఎయిర్ ఫైబర్ ద్వారా గరిష్టంగా 1.5 జీబీ వేగంతో డేటాను ఆశ్వాదించవచ్చు. గణేష్ చతుర్థి రోజున జియో ఎయిర్ ఫైబర్ అధికారికంగా అందుబాటులోకి వస్తుందని జియో ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాబట్టి ప్రస్తుతం అందించే ఫైబర్ సేవలకు ఎయిర్ ఫైబర్ సేవలకు ప్రధాన తేడాలేంటో? ఓసారి తెలుసుకుందాం.
జియో ఎయిర్ ఫైబర్
జియో ఎయిర్‌ఫైబర్ హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇది సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌లతో పోల్చదగిన వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో డేటాను వాడకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ కాంపాక్ట్ మాత్రమే కాకుండా సెటప్ చేయడం కూడా సులభం అని జియో పేర్కొంది. మీరు దీన్ని ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేస్తే ఈజీ వైఫై సహాయంతో ఈ సేవలను పొందవచ్చని జియో ప్రతినిధులు పేర్కొంటున్నారు.
జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మధ్య ప్రధాన తేడాలు
సాంకేతికత
జియో ఫైబర్ దాని కవరేజ్ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌లను ఉపయోగిస్తుంది, అయితే జియో ఎయిర్ ఫైబర్ పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్‌లను ఉపయోగించి వైర్‌లెస్ విధానాన్ని తీసుకుంటుంది. అంటే జియో ఎయిర్‌ఫైబర్ గృహాలు, కార్యాలయాలను నేరుగా జియోకి వైర్‌లెస్ సిగ్నల్స్ ద్వారా అనుసంధానిస్తుంది. దీంతో ఫైబర్ కేబుల్స్ పరిమితుల నుంచి విముక్తి పొందవచ్చు. బదులుగా ఇది జియో టవర్‌లతో లైన్-ఆఫ్-సైట్ కమ్యూనికేషన్‌పై ఆధారపడుతుంది.
వేగం
జియో ఎయిర్ ఫైబర్ గరిష్టంగా 1.5 జీబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని అందజేస్తుంది. ఇది జియో ఫైబర్ 1 జీబీపీఎస్ వేగాన్ని అధిగమిస్తుంది. అయితే జియో ఎయిర్‌ఫైబర్ వాస్తవ వేగం సమీప టవర్‌కు సామీప్యతను బట్టి మారవచ్చని గమనించాలి.
కవరేజ్
జియో ఫైబర్ విస్తృత కవరేజీని అందిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. దీనికి విరుద్ధంగా జియో ప్రకారం జియో ఎయిర్‌ఫైబర్ వైర్‌లెస్ సాంకేతికత భౌతిక మౌలిక సదుపాయాల ద్వారా పరిమితం కాకుండా విస్తృతమైన కవరేజీని అందించడానికి అనుమతిస్తుంది.
ఇన్‌స్టాలేషన్
జియో ఎయిర్ ఫైబర్ ప్లగ్-అండ్-ప్లే చేయడానికి రూపొందించారు. ఇది మరింత యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు జియో ఫైబర్‌కు సాధారణంగా ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్ అవసరం.
ధర
జియో ఎయిర్‌ఫైబర్ సేవ పోటీ ధరతో అంచనా వేయబడుతుంది. దీని ధర దాదాపు రూ. 6,000 వరకూ ఉంటుందని అంచనా. జియో ఎయిర్ ఫైబర్ సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే కొంచెం ఖరీదైనది కావచ్చు, ఎందుకంటే ఇందులో పోర్టబుల్ డివైజ్ యూనిట్ ఉంటుంది.
జియో ఎయిర్ ఫైబర్ కేవలం హై-స్పీడ్ ఇంటర్నెట్ కంటే ఎక్కువ అందిస్తుంది. ఇది తల్లిదండ్రుల నియంత్రణ సాధనాలు, వైఫై -6 కి మద్దతు, జియో సెట్-టాప్ బాక్స్‌తో అనుసంధానం, నెట్‌వర్క్‌పై ఎక్కువ నియంత్రణను కూడా కలిగి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..