Jio Fiber Plans: జియో ఫైబర్‌లో సరికొత్త ప్లాన్.. ఏకంగా 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్… ధర ఎంతో తెలుసా?
జియో ఫైబర్ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో ఏకంగా 14 కంటే ఎక్కువ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారలకు అందిస్తుంది. జియో ఫైబర్ 100 ఎంబీపీఎస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు రూ. 899 + జీఎస్టీ, 14 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లతో అందిస్తున్నారు.
భారతదేశంలో కొన్ని టెలికాం కంపెనీ ఫైబర్ సేవలను ప్రారంభించాయి. టెలికాం రంగంలో సంచలనాలకు కారణమైన జియో ప్రస్తుతం ఫైబర్ రంగంలో కూడా తన మార్క్‌ను చూపిస్తుంది. ఎప్పకప్పుడు సరికొత్త ప్లాన్స్‌ను లాంచ్ చేస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం ఎక్కువ స్మార్ట్ టీవీలను వాడడంతో పాటు ఓటీటీల్లో సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఓటీటీల్లో సినిమా చూడాలంటే వాటి సబ్‌స్క్రిప్షన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే అన్ని ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందలేము. అయితే ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ జియో ఫైబర్ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో ఏకంగా 14 కంటే ఎక్కువ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారలకు అందిస్తుంది. జియో ఫైబర్ 100 ఎంబీపీఎస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు రూ. 899 + జీఎస్టీ, 14 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లతో అందిస్తున్నారు.
కొత్త వినియోగదారుల కోసం ప్లాన్ 3/6/12 నెలల కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కోసం ఎఫ్‌యూపీ డేటా నెలకు 3.3టీబీ, అంటే డేటా అయిపోతుందనే చింత లేకుండా వినియోగదారులు తమ అన్ని స్ట్రీమింగ్ అవసరాల కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు ఈ ప్లాన్‌లో 550 ప్లస్ టీవీ ఛానెల్‌లతో ఆన్-డిమాండ్ టీవీ కూడా ఉంది. టీవీ కార్యక్రమాలు, చలనచిత్రాలు, క్రీడలను ప్రత్యక్షంగా చూడటం ఇష్టపడే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో ఉచితంగా జియో సెట్-టాప్ బాక్స్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న కస్టమర్లకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ 5, సోనీ లివ్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, సన్ నెక్స్ట్, హాయ్‌చోయ్, డిస్కవరీ ప్లస్, యూనివర్శల్ ప్లస్, ఇరోస్ నౌ, ఆల్ట్ బాలాజీ, లయన్స్ గేట్ ప్లే, షిమారో మీ, జియో సినిమా, జియో సావన్ వంటి ఓటీటీ యాప్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..