Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Save Phone From Water Damage: మీ ఫోన్ నీళ్లల్లో పడిందా? ఈ తప్పులు చేస్తే అసలుకే మోసం..

అసలు ఫోన్ నీటిలో పడగానే ఏం చేయాలి? టెక్ నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం. అలాగే కొన్ని ఫోన్లు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తున్నా అవి కొంతమేర మాత్రమే రక్షణ ఇస్తాయని పేర్కొంటున్నారు. చాలా మంది నీటిలో ఫోన్ పడితే ఏం చేయాలి? అంటూ నిపుణులు అడుగుతూ ఉంటారు.

Save Phone From Water Damage: మీ ఫోన్ నీళ్లల్లో పడిందా? ఈ తప్పులు చేస్తే అసలుకే మోసం..
Phone Water
Follow us
Srinu

|

Updated on: May 06, 2023 | 10:30 AM

ప్రస్తుత రోజుల్లో ఫోన్ అనేది రోజువారీ అవసరంగా మారింది. అయితే అన్ని సమయాల్లో దాన్ని కాపాడుకోవడం పెద్ద పనిగా మారింది. ఒక్కోసారి అనుకోకుండా ఫోన్ నీటిలో పడితే ఇక అంతే అది పోయినట్లే అని అనుకుంటూ ఉంటాం. ఒక్కసారిగా కంగారుగా దాన్ని శుభ్రం చేసి, ఆన్ చేయడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే టెక్నీషియన్ దగ్గరకు తీసుకెళ్ళి బాగు చేయిస్తాం. అయితే అసలు ఫోన్ నీటిలో పడగానే ఏం చేయాలి? టెక్ నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం. అలాగే కొన్ని ఫోన్లు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తున్నా అవి కొంతమేర మాత్రమే రక్షణ ఇస్తాయని పేర్కొంటున్నారు. చాలా మంది నీటిలో ఫోన్ పడితే ఏం చేయాలి? అంటూ నిపుణులు అడుగుతూ ఉంటారు. అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని రకాల సెల్‌ఫోన్ కేస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి అనుకోకుండా ఫోన్ నీటిలో పడినా ఫోన్‌ను మునగకుండా తేలేలా చేస్తాయి. ఈ చర్య పక్కనపెడితే ఇప్పుడు ఫోన్ నీటిలో పడిన వెంటనే ఏం చేయాలో? తెలుసుకుందాం.

  • మొదటగా ఫోన్‌ను నీటిలో నుంచి బయటకు తీయాలి. చార్జింగ్, హెడ్ ఫోన్ సాకెట్లలోకి నీరు వెళ్లకుండా చూడాలి.
  • ఫోన్ ఆన్‌లో వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి.
  • ఫోన్ కేస్ తీసి వేయాలి. అలాగే సిమ్ కార్డ్, ఎస్డీ కార్డ్ తీసేయాలి. రిమూవబుల్ బ్యాటరీ మోడల్ ఫోన్ అయితే బ్యాటరీని కూడా తీసేయాలి.
  • మీ ఫోన్‌ను ఆరబెట్టడానికి గుడ్డ లేదా పేపర్ టవల్ ఉపయోగించండి. ఫోన్‌ను అధికంగా రుద్దకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే పొరపాటున లిక్విడ్‌ని ఫోన్‌లోని సున్నితమైన భాగాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. 
  • ఫోన్ పూర్తిగా మునిగిపోతే ఫోన్ మడతలు, ఓపెనింగ్‌ల చుట్టూ సున్నితంగా వాక్యూమ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. 
  • చాలా మంది ఫోన్‌ను ఎండలో పెడతారు. కానీ ఇలా చేయకూడదు. ఫోన్‌ను పొడి ప్రదేశంలో ఉంచాలి. 
  • చాలా మంది వేడి వేడి అన్నంలో ఫోన్ పెడితే లోపల తడి ఆవిరి అయ్యిపోతుందని చెబుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 
  • ఫోన్ పూర్తిగా ఆరినట్టుగా ఉంటే అప్పుడు స్విచ్ ఆన్ చేయండి.. ఒకవేళ ఆన్ కాకపోతే చార్జింగ్ పెట్టి మరొక్కసారి ప్రయత్నించాలని నిపుణులు సూచన.

ఫోన్ ఇలా కనిపిస్తే పూర్తిగా దెబ్బతిన్నట్లే

  • ఫోన్ స్క్రీన్ వెనుక నీరు లేదా డల్ లైట్ వస్తే ఫోన్ డిస్‌ప్లే దెబ్బతిందని గుర్తించవచ్చు.
  • పోర్ట్‌ల్లో వద్ద తుప్పు పట్టినట్లుగా అయ్యిపోవడం.
  • డిస్కోలర్డ్ లిక్విడ్ డ్యామేజ్ ఇండికేటర్ (ఎల్‌డీఐ)ని తనిఖీ చేయాలి. ఎల్‌డీఐ అంటే సాధారణంగా హెడ్‌ఫోన్ జాక్, బ్యాటరీ కంపార్ట్‌మెంట్ లేదా సిమ్ ట్రే స్లాట్‌లో ఉంటుంది. మీ ఫోన్‌లో నీరు దెబ్బతింటే ఎల్‌డీఐ ఎరుపు లేదా మెరూన్ రంగులో కనిపిస్తుంది.

బియ్యంలో పెడితే ఏమవుతుందో తెలుసా?

నిపుణలు సూచన ప్రకారం ఫోన్ నీటిలో పడిన వెంటనే శుభ్రం చేసి బియ్యం కప్పి ఉంచితే కొంత మేర నీటిని బియ్యం గ్రహిస్తాయి. అయితే మీ ఫోన్లో దుమ్ము, పొడి పిండి వంటి ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. బియ్యం మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ లేదా హెడ్‌ఫోన్ జాక్‌లో కూడా పేరుకుపోయే అవకాశం ఉంది. అలాగే బ్లోయర్ ద్వారా ఆరబెట్టడానికి ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఫోన్ నీటిలో పడిన వెంటనే దాన్ని ఆన్ చేయకుండా వీలైనంత త్వరగా టెక్నీషియన్ సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..