OnePlus Summer Sale: వన్‌ప్లస్‌లో సమ్మర్ సేల్ స్టార్ట్.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపు
వివిధ కంపెనీల నుంచి పోటీనిస్తూ ప్రస్తుతం వన్ ప్లస్ కంపెనీ సమ్మర్ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన తమ కంపెనీ ఉత్పత్తులపై భారీ తగ్గింపునిస్తుంది. మే 4 నుంచి ప్రారంభమైన ఈ సేల్ మే 10 వరకూ ఉంటుంది.
లాంచింగ్ సమయం నుంచి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న కంపెనీ వన్ ప్లస్. ముఖ్యంగా ఈ కంపెనీ రిలీజ్ చేసే ఫోన్లు అంటే యువత ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఫోన్‌లో వచ్చే కెమెరాతో తీసే ఫొటోలు అత్యంత క్వాలిటీగా ఉండడంతో ఎక్కువ మంది ఫొటో లవర్స్‌ను ఈ కంపెనీ ఫోన్లు ఆకట్టుకున్నాయి. అలాగే వన్ ప్లస్ మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ స్మార్ట్ టీవీలను కూడా రిలీజ్ చేయడంతో ఎక్కువ మంది వన్‌ప్లస్ ఉత్పత్తులకు చేరువయ్యారు. అయితే వివిధ కంపెనీల నుంచి పోటీనిస్తూ ప్రస్తుతం వన్ ప్లస్ కంపెనీ సమ్మర్ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన తమ కంపెనీ ఉత్పత్తులపై భారీ తగ్గింపునిస్తుంది. మే 4 నుంచి ప్రారంభమైన ఈ సేల్ మే 10 వరకూ ఉంటుంది. ఈ సేల్‌లో ముఖ్యంగా కంపెనీ తమ మొబైల్స్‌పై భారీ తగ్గింపునిస్తుంది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్‌లో కంపెనీ ఈ ఆఫర్‌ను రన్ చేస్తుంది. ఈ ఆఫర్‌లో ఏయే ఉత్పత్తులు ధరలు తగ్గుతున్నాయో? ఓ లుక్కేద్దాం.
- ఈ సేల్‌లో వన్ ప్లస్ 10 ప్రో, 10 టీ, 10 ఆర్ ఫోన్లపై ఏకంగా రూ.11,000 తగ్గింపును ఇస్తుంది. ఈ ఆఫర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
- అలాగే వన్ ప్లస్ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లు, వన్ ప్లస్ బడ్స్ ప్రో 2/2ఆర్ 50 శాతం తగ్గింపుతో వస్తుంది.
- అలాగే వన్ ప్లస్ వెబ్‌సైట్, అలాగే వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్‌లో షాపింగ్ చేసినప్పుడు ఐసీఐసీ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ1000 తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెజాన్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 తగ్గింపు లభిస్తుంది.
- అమెజాన్‌లో వన్ ప్లస్ 10 ప్రో, 10 టీ ఫోన్లపై రూ.10,000 వరకూ తగ్గింపు లభిస్తుంది.
- అలాగే వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ పరికరాలకు 6-18 నెలల ఈఎంఐ ఎంపికలు ఉన్నాయి.
- అలాగే వన్ ప్లస్ ప్యాడ్‌పై రూ.5000 వరకూ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
- వన్ ప్లస్ నార్డ్ వాచ్‌లపై కంపెనీ రూ.1000 వరకూ తగ్గింపునిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ వాచ్‌లను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 తక్షణ తగ్గింపునిస్తుంది. ఈ ఆఫర్ ఫ్లిప్ కార్ట్, వన్ ప్లస్ యాప్, స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే అమెజాన్ ఈ వాచ్‌పై తగ్గింపు కావాలంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
- వన్ ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్, నార్డ్ ఇయర్ బడ్స్‌పై రూ.300 తగ్గింపు లభిస్తుంది.
- అలాగే నార్డ్ సీఈ2 లైట్, నార్డ్ సీఈ 3 ఫోన్స్‌పై రూ.1500 తగ్గింపు లభిస్తుంది. అలాగే ఆయా ఫోన్లను ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే నార్డ్ 2 టీపై 3/6 నెలలో ఆప్షన్లలో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
వన్ ప్లస్ టీవీలపై ఆఫర్లు ఇలా
- వన్ ప్లస్ టీవీ క్యూ 2 65 ఇంచుల టీవీపై రూ.5000 వరకూ తగ్గింపు వస్తుంది.
- అలాగే వై 1 టీవీలపై రూ.1500 తగ్గింపు వస్తుంది. అలాగే వై 1ఎస్, టీవీలపై కూడా రూ.1500 తగ్గింపు లభిస్తుంది.
- వన్ ప్లస్ వై1ఎస్ ఎడ్జ్ టీవీలపై రూ.1500, వై1 ప్రో టీవీలపై రూ.3000, వన్ ప్లస్ యూ1 ఎస్ టీవీలపై రూ.4000 వరకూ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ టీవీల తక్షణ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..