Jio VS Airtel: బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లోనూ పోటీ షురూ.. ఎయిర్‌టెల్, జియో రూ.999 ప్లాన్‌తో అందించే బెనిఫిట్స్ ఇవే…!

జియో ఫైబర్, ఎయిర్ ఎక్స్‌ట్రీమ్ కంపెనీలు రూ.999 ప్లాన్‌ను తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల గురించి అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముప్పై రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌ వల్ల కలిగే లాభాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

Jio VS Airtel: బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లోనూ పోటీ షురూ.. ఎయిర్‌టెల్, జియో రూ.999 ప్లాన్‌తో అందించే బెనిఫిట్స్ ఇవే…!
Jio, Airtel
Follow us
Srinu

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 11, 2023 | 5:09 PM

ప్రస్తుతం భారత టెలికాం మార్కెట్‌‌ను జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు శాసిస్తున్నాయి. ఈ రెండు ప్రైవేటు నెట్‌వర్క్‌ల స్పీడ్ ఒకే రకంగా ఉండడంతో పాటు ప్లాన్స్‌ కూడా ఇంచుమించు ఒకేలా ఉండడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఈ రెండు నెట్‌వర్క్‌ను వాడడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వ్యాపార విస్తరణలో భాగంగా ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం కొన్ని నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా అందిస్తున్నాయి. అక్కడ కూడా ఈ కంపెనీలు పోటీ పడుతున్నాయి.  ఈ రెండు కంపెనీల బ్రాడ్‌బ్యాండ్ ధరలు బేసిక్ ప్లాన్ నుంచి ప్రీమియం ప్లాన్ వరకూ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి.  దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలతోనే అదనపు సౌకర్యాలను కల్పించేందుకు రెండు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో ఫైబర్, ఎయిర్ ఎక్స్‌ట్రీమ్ కంపెనీలు రూ.999 ప్లాన్‌ను తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల గురించి అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముప్పై రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌ వల్ల కలిగే లాభాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

జియో ఫైబర్ రూ.999 ప్లాన్

జియో బ్రాడ్‌బ్యాండ్ రీఛార్జ్ ప్లాన్ అపరిమిత డేటా వినియోగం, కాలింగ్‌తో గరిష్టంగా 150 ఎంబీపీఎస్‌తో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఓటీటీ బండిల్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్, వూట్ సెలెక్ట్, సోనీ లైవ్, జీ 5, వంటి ఓటీటీ ప్లాన్స్ ను వినియోగదారులు పొందుతారు. వీటితో పాటు 550 చానల్స్ కూడా చూసే అవకాశం ఉంది. 

ఎయిర్ టెల్ రూ.999 ప్లాన్

ఎయిర్‌టెల్ తన రూ. 999 ఫైబర్ ప్లాన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ జాబితాలో చేర్చింది.  ఈ ప్లాన్ కింద 200 ఎంబీపీఎస్ వేగంతో వినియోగదారులు హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, అపరిమిత కాలింగ్ వంటి ప్రయోజనాలు పొందుతారు. అదనంగా ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, వీఐపీ, అపోలో 24/7, ఫాస్ట్‌ టాగ్ ఫీచర్లు, వింక్ ప్రీమియంపై క్యాష్‌బ్యాక్ వంటి సుదుపాయాలు అందిస్తారు. అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను కూడా పొందుతారు. 

ఇవి కూడా చదవండి

రెండు ప్లాన్‌ల మధ్య తేడాలివే

జియో ఫైబర్ రూ.999 ప్లాన్‌కు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.999 ప్లాన్‌కు మధ్య చాలా తేడాలున్నాయి. ఎయిర్ నెట్ వేగం 200 ఎంబీపీఎస్ ఇస్తుంటే, జియో మాత్రం 150 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే ఇస్తుంది. అయితే జియో 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఇస్తుంటే ఎయిర్‌టెల్ మాత్రం రెండు ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. అపరిమత కాలింగ్, డేటా వేగం రెండూ సారూప్యంగా ఉన్నా ఎయిర్‌టెల్ థ్యాంక్స్, వీఐపీ, వింక్ మ్యూజిక్ వంటి యాప్స్ అదనంగా వస్తున్నాయి. మొత్తం మీద రెండు ప్లాన్స్ ఒకేలా ఉన్నా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ విషయం వచ్చేసరికి జియో ఓ మెట్టు పైన ఉంది. దీంతో ఎక్కువ మంది మూవీ లవర్స్ జియో ఫైబర్ సేవలను పొందడానికి ఆసక్తి చూపుతారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..