Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి నెలా రూ.4,500 పెట్టుబడి పెడితే.. నెలకి రూ. 51,000 పెన్షన్.!

ప్రస్తుతం లైఫ్ బాగానే గడుస్తోంది కదా.. భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచిద్దాం.. లే.! అని చాలామంది ఉద్యోగులు ప్రతీసారి కొన్ని తప్పులు చేస్తారు. అందులో ఒకటి..

ప్రతి నెలా రూ.4,500 పెట్టుబడి పెడితే.. నెలకి రూ. 51,000 పెన్షన్.!
Retirement Plan
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Feb 11, 2023 | 4:41 PM

ప్రస్తుతం లైఫ్ బాగానే గడుస్తోంది కదా.. భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచిద్దాం.. లే.! అని చాలామంది ఉద్యోగులు ప్రతీసారి కొన్ని తప్పులు చేస్తారు. అందులో ఒకటి రిటైర్మెంట్‌ తర్వాత తమ జీవితం గురించి ఆలోచించకపోవడం. దీంతో సీనియర్ సిటిజన్లు అయ్యాక ఆర్ధిక పరిస్థితి బాగోలేక చిక్కుల్లో పడుతుంటారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్‌ ప్లాన్‌ కూడా అలోచించేసుకోవాలి. మరి లేట్ ఎందుకు ఈ వార్త చదివేయండి.

నేషనల్ పెన్షన్ స్కీమ్.. మీ రిటైర్మెంట్‌ తర్వాత ఉత్తమ ఎంపికలలో ఒకటి. ఈ పథకంలో మీరు ప్రతి నెలా కేవలం రూ.4,500 పెట్టుబడి పెడితే మీకు నెలకు రూ.51,848 పెన్షన్ లభిస్తుంది. నిజానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీనిలో చేరడానికి మీకు 21 సంవత్సరాలు ఉండాలి. అప్పటి నుంచి ప్రతీరోజూ రూ. 150 అనగా నెలకు రూ. 4,500 పెట్టుబడి పెట్టాలి. మొత్తం 39 సంవత్సరాలు ఏడాదికి 54,000 పెట్టుబడి పెడతారు. ఈ 39 సంవత్సరాల అమౌంట్‌ మొత్తం రూ.21.06 లక్షలు అవుతుంది. దీనిపై 10 శాతం రాబడితో మెచ్యూరిటీపై రూ. 2.59 కోట్ల ఫండ్‌ క్రియేట్‌ అవుతుంది. ఇక NPS పధకం కింద, లబ్దిదారులు మొత్తంలో నుంచి 40 శాతం వాటాను పెన్షన్‌గా పొందుతారు. అంటే రిటైరయ్యాక నెలకు దాదాపు రూ.51,848 పెన్షన్ లభిస్తుంది. ఈ మొత్తం ఎక్కువ లేదా కొంచెం తక్కువైన కావచ్చు. ఇది కాకుండా ఈ పథకంలో పన్ను మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఎన్‌పిఎస్‌పై ఆదాయపు పన్ను సెక్షన్ 80 సిసిడి (1), 80 సిసిడి (1బి), 80 సిసిడి (2) కింద మీరు పన్ను రాయితీ పొందవచ్చు. అంటే దాదాపు ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 2 లక్షల మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

NPS ఖాతాని ఇలా ఓపెన్ చేయండి..

1. NPS ఖాతాను తెరవడానికి enps.nsdl.com/eNPS వెళ్లి, కొత్త నమోదుపై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

2. అన్ని వివరాలను నింపిన తర్వాత మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దానిని ధ్రువీకరించండి. బ్యాంక్ ఖాతా వివరాలను ఎంటర్ చేయండి. మీ పోర్ట్‌ఫోలియో ఫండ్‌ని ఎంచుకోండి.

3. వివరాలు నింపాల్సిన బ్యాంకు ఖాతాలో రద్దు చేయబడిన చెక్కును అందించాలి. అంతే కాకుండా ఫొటో, సంతకం కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చెల్లింపు చేసిన తర్వాత మీ శాశ్వత పదవీ విరమణ ఖాతా (PRN) నంబర్ జనరేట్ అవుతుంది. మీరు చెల్లింపు రశీదు కూడా పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..