Ola EV Car: ఓలా మాస్టర్ ప్లాన్.. త్వరలోనే మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ కార్.. వచ్చే ఏడాదికి మరిన్ని లైన్‌లో..
త్వరలోనే భారత్‌లోని టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ కార్లకు పోటీగా ఈవీ కార్‌ను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఓలా బైక్ స్కూటర్లలో కూడా 5 కొత్త వేరింయంట్లను వచ్చే ఏడాది లాంచ్ చేస్తామని ప్రకటించింది.

భారత్‌లో క్రమేపి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన శ్రేణిలో వాటి వాడకం అనూహ్యంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోని స్కూటర్ల విభాగంలో ఓలా తన ప్రత్యేకతను సాధించుకుంది. ముఖ్యంగా డిజైన్‌పరంగా అధికంగా కస్టమర్లు ఓలా వైపు మొగ్గు చూపేలా చేసింది. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది. అయితే తన వ్యాపార విస్తరణలో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ భవిష్యత్ మరో కొత్త వాహనాలను ప్రారంభించబోతుంది. త్వరలోనే భారత్‌లోని టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ కార్లకు పోటీగా ఈవీ కార్‌ను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఓలా బైక్ స్కూటర్లలో కూడా 5 కొత్త వేరింయంట్లను వచ్చే ఏడాది లాంచ్ చేస్తామని ప్రకటించింది. ఓలా ప్రకటనతో ఒక్కసారిగా మార్కెట్ వర్గాలు ఓలా కొత్త ప్రొడెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.
ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓలా తన కొత్త ప్రొడెక్ట్స్ వివరాలను తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తర్వాత ఎలక్ట్రిక్ బైక్ తయారీపై దృష్టి పెట్టామని, వచ్చే ఏడాది వాటిని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేఫ్ రేసర్, అడ్వంచర్ టూరర్, స్కాంబ్లర్, నేక్ట్డ్ పేర్లతో మోటర్ సైకిళ్లను ఓలా రిలీజ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మోటర్ సైకిళ్లు ప్రీమియం, మాస్ వెర్షన్లతో కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని పేర్కొంటున్నాయి. అనంతరం ఓలా కంపెనీ కార్ తయారీపై తన దృష్టి పెట్టిందని కొందరు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నిర్వహించిన కార్యక్రమంలో ఓలా కార్ల గురించి వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను పరిశీలిస్తే ఓలా కంపెనీ భవిష్యత్‌లో వివిధ వాహనాలను రిలీజ్ చేయడానికి ప్రణాళిక రచిస్తుందని పేర్కొంటున్నారు.
అలాగే ఓలా కంపెనీ ఇటీవల రిలీజ్ చేసిన ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్లలో కూడా కొత్త వేరియంట్లను ప్రవేశ పెడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2 కెడబ్ల్యూహెచ్, 3కెడబ్ల్యూహెచ్, 4కెడబ్ల్యూహెచ్ వేరియంట్లలో స్కూటర్ అందుబాటులో ఉండనుందని పేర్కొంటున్నాయి. ఓలా స్కూటర్లలో ఎస్1, ఎస్ 1 ప్రో స్కూటర్ల ఈవీ మార్కెట్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేశాయని ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. గత నెలలో ఏకంగా 25000 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముడైనట్లు ఓ నివేదికలో తేలింది. అయితే గత దీపావళి సమయంలో రిలీజ్ చేసి ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ కు 2.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో మాత్రమే వచ్చేది. తర్వాత దాన్ని 3 కెడబ్ల్యూహెచ్ పెంచామని, అయినా వినియోగదారులకు ఎలాంటి అదనపు చార్జిలు లేకుండా ప్రస్తుతం స్కూటర్లను డెలివరీ చేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం..