AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola electric: ఓలా నుంచి సూపర్ అప్ డేట్.. ఇక నుంచి విద్యుత్ కార్లపైనే ఫోకస్..  వచ్చే ఏడాది కొత్త కారు లాంచ్..

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ లో వినియోగిస్తున్న సాఫ్ట్ వేర్, సేఫ్టీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, సెల్స్, డ్రైవ్ ట్రైన్ వంటి టెక్నాలజీని ఎలక్ట్రిక్ కారులో కూడా వినియోగించనున్నామని ఓలా కంపెనీ ప్రకటించింది.

Ola electric: ఓలా నుంచి సూపర్ అప్ డేట్.. ఇక నుంచి విద్యుత్ కార్లపైనే ఫోకస్..  వచ్చే ఏడాది కొత్త కారు లాంచ్..
Ola Electric
Madhu
|

Updated on: Feb 11, 2023 | 1:45 PM

Share

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో పాటు వినియోగదారులకు అద్భుతమైన అనుభూతినిచ్చే ఫీచర్లతో మన దేశంలోనే టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను దేశంలో విక్రయిస్తోంది. వాటిలో ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో, ఓలా ఎస్ 1 ఎయిర్ మోడళ్ళు ఉన్నాయి. వీటి విక్రయాలు నెలనెలకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓలా తన మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు ‌ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటి వరకూ ద్విచక్ర వాహనాలకే పరిమితమైన ఈ కంపెనీ ఇకపై కార్లను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నాటికి తన మొదటి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జీఆర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్, రైడ్ హెయిలింగ్ కంపెనీ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన డిజైన్ పై దృష్టి సారించిందని, అలాగే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్తులో విడుదల చేయనున్న తమ ఎలక్ట్రిక్ కారులో కూడా వినియోగించనున్నట్లు కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ లో వినియోగిస్తున్న సాఫ్ట్ వేర్, సేఫ్టీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, సెల్స్, డ్రైవ్ ట్రైన్ వంటి టెక్నాలజీని ఎలక్ట్రిక్ కారులో కూడా వినియోగించనున్నామని కుమార్ వివరించారు.

వీలైనంత తక్కువ ధరకే..

తమ మొదటి ఎలక్ట్రిక్ కారు ధరను 50,000 డాలర్ల కంటే తక్కువకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానిలో భాగంగా ఖర్చును తగ్గించడానికి లిథియం-అయాన్ సెల్స్, బ్యాటరీలు వంటి విడిభాగాలను దేశీయంగా తయారు చేస్తామని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో టెస్లా ఇంక్, హ్యుందాయ్ మోటార్ కంపెనీ, టాటా గ్రూప్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడాలని ఓలా లక్ష్యంగా పెట్టుకుందని, 2030 నాటికి ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ 150 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని కన్సల్టెన్సీ ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్ అంచనా వేసింది.

సొంతంగా ప్లాంట్ల నిర్వహణ..

స్థానికంగా ఉన్న ప్లాంట్లను అనుసంధానించడం ద్వారా 100 గిగావాట్ల బ్యాటరీ-సెల్ తయారీ సామర్థ్యాన్ని అందించాలనే లక్ష్యంలో ఓలా పురోగతి సాధిస్తోందని, అలాగే 18 నుంచి 24 నెలల్లో 10 గిగావాట్ హావర్స్, అలాగే 36 నెలల్లో 20 గిగావాట్ హావర్స్ కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుమార్ తెలిపారు. ఇలా తయారు చేసిన లిథియం-అయాన్ సెల్స్ ను ఓలా తన సొంత వాహనాలకు వినియోగించడంతో పాటు, ఇతర సంస్థలకు కూడా విక్రయించే అవకాశం ఉందని కుమార్ తెలిపారు. అయితే ఇది బయట మార్కెట్లో లిథియం-అయాన్ సెల్స్ కి ఉన్న డిమాండ్ పై ఆధారపడి ఉంటుందని కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..