Science: చేపలు అచ్చం మనుషుల్లాగే భయం, ప్రేమ చూపుతాయట.. వెల్లడైన ఇంట్రస్టింగ్ విషయాలు..
ఒక వ్యక్తి.. ఎదుటి వ్యక్తి భయపడితే ఈజీగా గుర్తించగలడు. అలాగే జంతువులు తమ సహ జంతువులు భయపడితే గుర్తించగలవా? నీటిలో నివసించే ఒక చేతప ఇతర చేపల భయాన్ని గుర్తిస్తుందా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా చేపలు తమ తోటి చేపల భయాన్ని గుర్తిస్తాయని చెబుతున్నారు వారు.

ఒక వ్యక్తి.. ఎదుటి వ్యక్తి భయపడితే ఈజీగా గుర్తించగలడు. అలాగే జంతువులు తమ సహ జంతువులు భయపడితే గుర్తించగలవా? నీటిలో నివసించే ఒక చేతప ఇతర చేపల భయాన్ని గుర్తిస్తుందా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా చేపలు తమ తోటి చేపల భయాన్ని గుర్తిస్తాయని చెబుతున్నారు వారు. అంతేకాదు.. ఎదుటి చేపల భయాన్ని ఇవి కూడా అనుభవిస్తూ తీవ్ర భయాందోళనకు గురవుతాయట.
పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. బలవంతుడిని చూసి బలహీనుడు భయపడుతాడు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. మనుషుల్లోనూ, జంతువుల్లోనూ ఇది చూస్తూనే ఉంటాం. కానీ, చేపల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మనుషుల మాదిరిగానే జంతువులు, చేపలు కూడా భయం, ప్రేమను అనుభూతి చెందుతాయని ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్ట్ అయిన హాన్స్ హాఫ్‌మన్ పేర్కొన్నారు.
చేపలు మనుషుల్లా ప్రవర్తిస్తాయి..
చేపలు మనుషుల్లాగే ప్రవర్తిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇతర చేపల భయాన్ని పసిగడుతాయట. ఆపై అవి కూడా భయపడుతాయట. ఆక్సిటోసిన్ కారణంగా చేపలో ఈ పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అయితే మనుషుల్లోనూ ఈ రసాయన కారణంగానే తదాత్మ్యత ఏర్పడుతుందని చెబుతున్నారు. పరిశోధకులు జీబ్రాఫిష్‌పై పరిశోధనలు చేశారు. దీని మెదడులో ఆక్సిటోసిన్ ఉత్పత్తి, శోషణను గమనించారు. వీటి కారణంగా ఎదుటి చేపల్లోని భయాన్ని అవి గుర్తిస్తున్నాయని, వాటి భయాన్ని చూసి ఇవి కూడా ఆందోళనకు గురవుతాయని గుర్తించారు. అయితే, ఇలా చేయడానికి ఒక కారణం ఉందంటున్నారు నిపుణులు. ఒత్తిడిలో ఉన్న చేపల పట్ల ఇతర చేపలు ప్రత్యేక శ్రద్ధ చూపుతాయట. ఎదుటి చేపలను ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తాయట. వీటి చర్యలకు ఆక్సిటోసిన్ కారణం అని చెబుతున్నారు.




మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..