Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aliens: మనుషుల స్పెర్మ్, అండాలను దొంగిలిస్తున్న గ్రహాంతరవాసులు.. కారణమిదేనట..!

గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఒకవైపు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా? అనేదే పెద్ద సందేహం. అయినప్పటికీ.. గ్రహాంతరవాసులు భూమిపైకి దిగినట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలు, ప్రచారాల నేపథ్యంలో గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనా అన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా

Aliens: మనుషుల స్పెర్మ్, అండాలను దొంగిలిస్తున్న గ్రహాంతరవాసులు.. కారణమిదేనట..!
Aliens
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 29, 2023 | 8:00 AM

గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఒకవైపు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా? అనేదే పెద్ద సందేహం. అయినప్పటికీ.. గ్రహాంతరవాసులు భూమిపైకి దిగినట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలు, ప్రచారాల నేపథ్యంలో గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనా అన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. ఇక తాజాగా ఆ పరిశోధకుడు గ్రహాంతర వాసుల గురించి సంచలన వివరాలు చెప్పారు. ఈ ఏలియన్స్ అర్థరాత్రి భూమిపై దిగి.. మనుషుల స్పెర్మ్, అండాలను దొంగిలిస్తున్నారట. వీటి సాయంతో భూమిపై మనుషుల మధ్య జీవించగలిగే కృత్రిమ ఏలియన్స్‌ను తయారు చేస్తున్నారట.

భూమిని ఆక్రమిస్తారా?

ఏలియన్స్‌పై పరిశోధనలు చేస్తున్న కోలిన్ సాండర్స్ అనే సైంటిస్ట్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. గ్రహాంతరవాసులు భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రహాన్ని నాశనం చేయడానికి మనుషులు ప్రయత్నిస్తున్నారని, దాంతో వారే ఈ గ్రహాన్ని ఆక్రమించే యోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే.. మనుషుల్లో కలిసిపోయే కృత్రిమ ఏలియన్స్‌ను సృష్టిస్తున్నారని చెప్పారు. వారు మన భార్య, భర్త, ఇతర కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉంటారని చెబుతున్నారు.

మనుషుల కిడ్నాప్..

కోలిన్ సాండర్స్ తన అనుభవాల ఆధారంగా ‘ట్రయాంగిల్ క్రాఫ్ట్’ అనే పుస్తకాన్ని రాశారు. ఏలియన్స్ మనలాగే కనిపిస్తారని, అందువల్ల వారిని వేరు చేయడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రహాంతరవాసులచే అపహరణకు గురయ్యారని చెప్పిన పలువురిని ఇంటర్వ్యూ చేశానని కోలిన్ చెప్పారు. కిడ్నాప్ చేసిన వారిని భూమి నుంచి అంతరిక్షానికి తీసుకెళ్లినట్లు చెప్పారన్నారు. అలా తీసుకెళ్లిన వారి నుంచి స్పెర్మ్, అండాలు తీసుకుంటారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కృత్రిమ మనుషుల సృష్టి..

ఏలియన్స్ కిడ్నాప్ చేసిన మనుషుల నుంచి స్పెర్మ్, అండాలు తీసుకుని, వాటిని కలిపి మనిషిని సృష్టిస్తారన్నారు కోలిన్. ఆ తరువాత ఆ మనుషులతో ఏలియన్స్ కలవడం ద్వారా ఏలియన్+మనిషి కలగలసిన వ్యక్తిని సృష్టిస్తారని పేర్కొన్నారు. అలా గ్రహాంతర మానవజాతి సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు కోలిన్. అయితే, కోలిన్ చెబుతున్నట్లు విషయాలను కొందరు కొట్టిపారేస్తుండగా.. మరికొందరు విశ్వసిస్తున్నారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..