IPhone: వైర్‌లెస్‌ చార్జింగ్‌ టెక్నాలజీలో మరో అడుగు ముందుకేసిన టెక్‌ దిగ్గజం.. బ్యాక్‌ కవర్‌తో ఫోన్‌ చార్జింగ్‌..

IPhone Wireless Charging: టెక్‌ కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా రోజుకో కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. యూజర్లను తమ బ్రాండ్‌ వైపు ఆకర్షించే క్రమంలో..

IPhone: వైర్‌లెస్‌ చార్జింగ్‌ టెక్నాలజీలో మరో అడుగు ముందుకేసిన టెక్‌ దిగ్గజం.. బ్యాక్‌ కవర్‌తో ఫోన్‌ చార్జింగ్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 21, 2021 | 4:53 PM

IPhone Wireless Charging: టెక్‌ కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా రోజుకో కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. యూజర్లను తమ బ్రాండ్‌ వైపు ఆకర్షించే క్రమంలో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా టెక్‌ కంపెనీలు వైర్‌ లైస్‌ చార్జింగ్‌ సాంకేతికతపై దృష్టి సారిస్తున్నాయి. ఎమ్‌ఐ, సామ్‌సంగ్‌, ఎల్‌జీ వంటి కంపెనీలు వైర్‌లైస్‌ చార్జింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టెక్‌ దిగ్గజం యాపిల్‌ మరో సరికొత్త టెక్నాలజీని నాంది పలికింది. ఫోన్‌కు అమర్చే బ్యాక్‌ కవర్‌తో చార్జింగ్‌ అయ్యే వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. బ్యాటరీ ప్యాక్‌గా పిలిచే ఈ పరికరం ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లా పనిచేయడంతో పాటు మొబైల్‌ చార్జింగ్‌ కూడా చేసస్తోంది. ఈ సరికొత్త టెక్నాలజీపై యాపిల్‌ ఏడాది కాలంగా కృషి చేస్తోంది. ఐఫోన్‌ 12 సిరీస్‌ తర్వాత వచ్చే ఫోన్లకు సపోర్ట్‌ చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. మరి యాపిల్‌ తీసుకున్న రానున్న ఈ కొత్త టెక్నాలజీ ఐఫోన్‌ అమ్మకాలపై ఏమేర ప్రభావం చూపుతాయో చూడాలి. Also Read: Location Tracking : స్మార్ట్ ఫోన్‌లో లొకేషన్ ట్రాకింగ్ యాప్‌తో వ్యక్తిగత వివరాలు ఎలా చోరీ అవుతున్నాయో తెలుసా..!