Chandrayaan-3: చంద్రయాన్‌-3 వాయిదా.. కీలక విషయాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్‌ ‌.. ఈ ప్రయోగం ఎందుకంత కీలకం..!

Chandrayaan-3: చంద్రుడి వద్దకు చేరే ప్రయత్నంలో భాగంగా భారత్‌ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్‌-3 వాయిదా పడింది. 2022లో చేపడతాయమని భారత అంతరిక్ష పరిశోధన...

Chandrayaan-3: చంద్రయాన్‌-3 వాయిదా.. కీలక విషయాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్‌ ‌.. ఈ ప్రయోగం ఎందుకంత కీలకం..!
Follow us

|

Updated on: Feb 21, 2021 | 6:41 PM

Chandrayaan-3: చంద్రుడి వద్దకు చేరే ప్రయత్నంలో భాగంగా భారత్‌ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్‌-3 వాయిదా పడింది. 2022లో చేపడతాయమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. 2019 సెప్టెంబర్‌ నాటి చంద్రయాన్‌ -2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైనప్పటికీ.. పట్టు విడవకుండా ఇస్రో తన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కోవిడ్‌-19 కారణంగా చంద్రయాన్‌-3, అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌తో సహా పలు ఇస్రో ప్రాజెక్టులపై పడినట్లు ఇస్రో చైర్మన్‌ కే. శివన్‌ వెల్లడించారు. నిజానికి 2020 చివరిలో జరగాల్సిన ఈ ప్రయోగాలు వచ్చే ఏడాదిలో కావచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో మేము పరిశోధనలు జరుపుతున్నాము. ఈ ప్రయోగం కూడా చంద్రయాన్‌-2 మాదిరిగానే ఉన్నా.. దీనికి ప్రత్యేక అర్బిటార్‌ ఉండకపోవడం విశేషం. చంద్రయాన్‌-2 సమయంలో ప్రయోగించిన ఆర్బిటార్‌నే ఇందులోనూ వాడతామని శివన్‌ అన్నారు. ఈ మిషన్‌ 2020ఏడాదిలో ప్రయోగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు.

చంద్రయాన్ -3 ప్రయోగం భారత్‌కు ఎందుకు కీలకం:

కాగా, 2019 సెప్టెంబర్‌ 7న విక్రమ్‌ ల్యాండర్‌ తొలి ప్రయత్నంలో చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగు పెట్టి చివరి నిమిషంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే ఇస్రోకు చంద్రయాన్‌-3 చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇది మరింత అంతర గ్రహాల కోసం ల్యాండింగ్‌ చేయడానికి భారత్‌ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది.

ఇస్రో భవిష్యత్తులో పలు గ్రహాంతర యాత్రలను చేపట్టనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని చాటిచెప్పేందుకు చంద్రయాన్‌-3 కీలక కానుంది.ఈ ప్రయోగం అనంతరం ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్‌-3 ప్రాజెక్టుపై దృష్టి సారిస్తామని చైర్మన్‌ శివన్‌ అన్నారు. ఇందుకు నలుగురు భారత వ్యోమగాములు అవసరమైన శిక్షణ పొందుతున్నారని ఆయన వెల్లడించారు.

Also Read: Mars rover: మార్స్ రోవర్ ప్రయోగం విజయవంతం.. అంగారకుడిపై తీసిన ఫొటోను షేర్ చేసిన నాసా..