పెట్రోల్, డీజిల్‌పై రూ.1 తగ్గింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం
చమురు ధరలపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలవేళ దీదీ ప్రభుత్వం వినియోగదారులకు తీపికబురు అందించింది.
Bengal government on petrol rates : చమురు ధరలపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలవేళ దీదీ ప్రభుత్వం వినియోగదారులకు తీపికబురు అందించింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అర్థరాత్రి నుంచి తగ్గించిన ధరలు అమలవుతాయని ఆదివారం వెల్లడించింది. ఈ రోజు రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ రెండింటిపై రూ.1 చొప్పున తగ్గుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బెంగాల్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరటినిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక రూపాయి ట్యాక్స్‌ను తగ్గించినట్లు తెలిపారు. ‘కేంద్ర పెట్రోల్‌పై ట్యాక్స్‌ల రూపంలో రూ.32.90 తీసుకుంటోంది. కానీ రాష్ట్రాలకు కేవలం రూ.18.46 మాత్రమే లభిస్తోంది. అలాగే, డీజిల్‌పై రూ.31.80 పైసలు ట్యాక్స్ వసూలు చేస్తోంది. కానీ రాష్ట్రాలకు మాత్రం రూ.12.77 మాత్రమే అందుతోంది. అయినప్పటికీ ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించేందుకు నిర్ణయించిందని అమిత్ మిత్రా వెల్లడించారు. దీదీ సర్కార్ నిర్ణయం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా చమురు ధరలు నిత్యం పెరుగుతూ జనానికి చుక్కలు చూపిస్తున్నాయి.
Read Also … రైతుల ఆందోళన, రాజస్తాన్ కాంగ్రెస్‌లో విభేదాలు, పోటాపోటీ ప్రదర్శనలు, షో ఆఫ్ స్ట్రెంత్