రైతుల ఆందోళన, రాజస్తాన్ కాంగ్రెస్‌లో విభేదాలు, పోటాపోటీ ప్రదర్శనలు, షో ఆఫ్ స్ట్రెంత్

రైతుల ఆందోళనకు మద్దతు విషయంలో రాజస్తాన్ కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పరోక్షంగా లుకలుకలు మొదలయ్యాయి..

రైతుల ఆందోళన, రాజస్తాన్ కాంగ్రెస్‌లో విభేదాలు, పోటాపోటీ ప్రదర్శనలు, షో ఆఫ్ స్ట్రెంత్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 21, 2021 | 5:58 PM

రైతుల ఆందోళనకు మద్దతు విషయంలో రాజస్తాన్ కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పరోక్షంగా లుకలుకలు మొదలయ్యాయి. (గత ఏడాది వీరి మద్జ్య రేగిన వివాదాలు నెలరోజులపైగా కొనసాగి ఆ తరువాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల చొరవతో పరిష్కారమయ్యాయి. ఇద్దరూ సయోధ్య కుదుర్చుకున్నారు). ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనకు మద్దతు నివ్వాలంటూ రాహుల్ పిలుపునివ్వగా సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యాన ఈ నెల 12, 13 తేదీలలో రైతుల ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీలో సచిన్ పైలట్ వర్గీయులెవరూ కనిపించలేదు. ఇక  జైపూర్ సమీపంలో ఈ నెల 19 న (శుక్రవారం) సచిన్ నేతృత్వాన జరిపిన ర్యాలీకి గెహ్లాట్ శిబిరం నుంచి ఎవరూ హాజరు కాలేదు. పైలట్ సహచరులు 17 మంది, మరికొంతమంది మాత్రం హాజరయ్యారు. (ఈ 17 మంది నాడు సచిన్ కి మద్దతు పలికి ఆయన వెంటే ఉన్నారు). తాజాగా నిన్న జైపూర్ లో రైతుల భారీ సభ జరగగా పైలట్ వర్గీయులు గైర్ హాజరయ్యారు. అంటే రైతుల విషయం అటుంచి ఎవరి దారి వారిదే అన్నట్టు తయారయింది.

కేవలం రెండు  వర్గాల  షో ఆఫ్ స్ట్రెంత్ మాదిరి ఉందని పరిశిలకులు భావిస్తున్నారు . అయితే పార్టీలో ఫ్యాక్షనిజం అన్నది లేదని కొందరు సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. ఆయా జిల్లాల్లో అన్నదాతలకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తన్నామని వారు చెప్పారు. సచిన్ పైలట్ కూడా దీనికి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు.  అసలు తమ ఆందోళనలో ఏ రాజకీయ పార్టీ నేతనూ అడుగుపెట్టనివ్వబోమని, వేదికపై ఒక్క రాజకీయ నేత కూడా ఉండరని, వారికి మైక్ ఇవ్వబోమని రైతు నాయకులు పలికిన మాటలు నీటి మూటలే అవుతున్నాయి.

Also Read:

నీతి ఆయోగ్ భేటీలో బీహార్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు.. ‘ఒక దేశం-ఒకే విద్యుత్తు రేటు’ అమలు చేయాలిన డిమాండ్

Dilsukhnagar Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్‌ విషాదానికి ఎనిమిదేళ్లు.. ఇంకా మర్చిపోలేకపోతున్న బాధితులు