AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కోడింగ్’ రాయడం ఎంత సులభమంటే..!?

సాఫ్ట్ వేర్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘కోడింగ్’ చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు రెగ్యులర్ చదువులు వెలగబెడుతూనే మరోవైపు కోడింగ్ జపం చేస్తూనే వున్నారు టెక్ స్టూడెంట్స్. ఇటీవలి కాలంలో స్కూలింగ్ నుంచే కోడింగ్ నేర్పించడం మొదలుపెట్టాయి కొన్ని కరిక్యులమ్స్. మరికొన్ని దేశాల్లో కోడింగ్ మీద ఏకంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులనే ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో.. యాపిల్ కంపెనీ సీఈఓ టిక్ కుక్ ‘టెక్ క్రంచ్’ కిచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ”కోడింగ్ కి ప్రాధాన్యత […]

'కోడింగ్' రాయడం ఎంత సులభమంటే..!?
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: May 13, 2019 | 7:19 PM

Share

సాఫ్ట్ వేర్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘కోడింగ్’ చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు రెగ్యులర్ చదువులు వెలగబెడుతూనే మరోవైపు కోడింగ్ జపం చేస్తూనే వున్నారు టెక్ స్టూడెంట్స్. ఇటీవలి కాలంలో స్కూలింగ్ నుంచే కోడింగ్ నేర్పించడం మొదలుపెట్టాయి కొన్ని కరిక్యులమ్స్. మరికొన్ని దేశాల్లో కోడింగ్ మీద ఏకంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులనే ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో.. యాపిల్ కంపెనీ సీఈఓ టిక్ కుక్ ‘టెక్ క్రంచ్’ కిచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ”కోడింగ్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కానీ.. కోడింగ్ కోసం ప్రత్యేకించి నాలుగేళ్ల ప్రత్యేక డిగ్రీ కోర్సు చెయ్యాల్సిన అవసరం లేదు. కోడింగ్ లో ప్రోఫీషియన్సీ రావడం కోసం అంతటి భీకరమైన కసరత్తుతో పనేమిటి?” అంటూ ప్రశ్నించారాయన.

”స్కూల్ ఏజ్ నుంచే కోడింగ్ మీద అవగాహన కల్పిస్తే.. టెన్త్ స్టాండర్డ్ ముగించేసరికి యాప్స్ డెవలప్ చేసి ప్లేస్టోర్‌లో అప్లోడ్ చెయ్యగల సామర్థ్యం వచ్చేస్తుంది” అన్నది టిమ్ కుక్ సలహా. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో కోడింగ్‌కుండే ప్రాధాన్యతను ఇప్పటికే టెక్నో వరల్డ్ గ్రహించింది. కానీ.. కొన్ని విద్యావ్యవస్థల్లో కోడింగ్ అనే సబ్జెక్టుని ఒక భూతంలా చూపెట్టడం కుక్ లాంటి టెక్ దిగ్గజాలకు రుచించడం లేదు. ఓర్లాండోలో తరచూ జరిగే ‘యాపిల్స్ యాన్యువల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ – WWDC’ సదస్సుల్లో ఉత్సాహవంతులైన స్కూల్ పిల్లల్ని ఆహ్వానించి.. ఆపరేటింగ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ డివైసెస్, కోడింగ్ నాలెడ్జ్ మీద అవగాహన కల్పిస్తారు. కోడింగ్ అనేది ఎంత ఆడుతూ పాడుతూ చెయ్యచ్చో చేసి చూపెడతారెక్కడ!