ఉబర్ న్యూప్లాన్.. మైక్రో మొబిలిటీలో అడుగు
ట్రెండ్‌ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. తద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు వేగంగా అడుగు లేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగావున్న భారత్‌పై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. ఇటీవలకాలంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉబర్ క్యాబ్‌ల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తడం, ఆపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో పరిస్థితి గమనించిన ఆ సంస్థకు కొత్త ఆలోచనలకు తెరలేపింది. ప్రయాణం హ్యాపీగా, వేగంగా, పర్యావరణహితంగా వుండేలా ‘మైక్రో మొబిలిటీ’ సెక్టార్‌లోకి అడుగుపెట్టేసింది. మైక్రో మొబిలిటీ అంటే ఏంటి? ట్రాఫిక్ […]

ట్రెండ్‌ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. తద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు వేగంగా అడుగు లేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగావున్న భారత్‌పై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. ఇటీవలకాలంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉబర్ క్యాబ్‌ల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తడం, ఆపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో పరిస్థితి గమనించిన ఆ సంస్థకు కొత్త ఆలోచనలకు తెరలేపింది. ప్రయాణం హ్యాపీగా, వేగంగా, పర్యావరణహితంగా వుండేలా ‘మైక్రో మొబిలిటీ’ సెక్టార్‌లోకి అడుగుపెట్టేసింది.
మైక్రో మొబిలిటీ అంటే ఏంటి?
ట్రాఫిక్ జామ్‌లతో విసిగిపోతున్నవాళ్లకి గుడ్‌న్యూస్ చెప్పింది ఉబర్ సంస్థ. ఇందుకోసం టెక్నాలజీ ఆధారిత మొబైల్ ఫ్లాట్ ఫారం ‘యులు’తో జతకట్టింది ఆ సంస్థ. బెంగుళూరులో వినియోగదారులకు అందుబాటులోకి ఈ-బైకులు, సైకిళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కముక్కలో చెప్పాలంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో బైకులను అద్దెకు తీసుకునే పద్దతన్నమాట. కాకపోతే పర్యావరణానికి డ్యామేజ్ కాకుండా తీసుకొచ్చిన కొత్త కాన్సెప్ట్ ఇది. ఈ వెహికల్స్ మీద మెట్రో సిటీస్‌లో 20 కిలోమీటర్లు వేగం, మిగతా టౌన్లలో 25 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేయవచ్చు.
ఈ-బైక్‌లు ఎలా తీసుకోవాలి?
ఈ-బైక్‌లను అద్దెకి తీసుకునేవారు ముందుగా ఉబర్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ-బైక్‌లను వినియోగించాలనుకునే వాళ్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్ సాయంతో వాటిని ఓపెన్ చేయవచ్చు. ఛార్జ్ ఎంతనేది యాప్‌లో వివరాలుంటాయి. నిత్యం కార్లతో బిజీగా మారిన ప్రధాన సిటీల్లో ఈ తరహా విధానం వల్ల కొంతలోకొంత ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు. మరీ ముఖ్యంగా ప్రపంచంలో టాప్-10 అత్యధిక కాలుష్యమైన నగరాల్లో ఇండియాకి చెందినవి ఏడు వున్నాయి. ఈ కాన్సెప్ట్‌ని మిగతా నగరాలకు విస్తరించేపనిలో నిమగ్నమైంది ఉబర్.