Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదిలోనే హంసపాదు.. కేవలం 40 సెకన్లలోనే నేల కూలిన తొలి రాకెట్..!

ఆదివారం (మార్చి 30) నార్వేలో టేకాఫ్ అయిన 40 సెకన్లకే ఒక రాకెట్ కూలిపోవడంతో యూరప్ అంతరిక్ష కార్యక్రమం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో రాకెట్ ఆకాశంలోనే పేలిపోతున్నట్లు కనిపించింది. . రాకెట్ పేలుడు జరిగినప్పటికీ, ఈ సంఘటన భవిష్యత్ మిషన్లకు ఉపయోగపడే ముఖ్యమైన డేటాను అందించిందని కంపెనీ తెలిపింది.

ఆదిలోనే హంసపాదు.. కేవలం 40 సెకన్లలోనే నేల కూలిన తొలి రాకెట్..!
Spectrum First Launch
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 30, 2025 | 8:52 PM

ఆదివారం (మార్చి 30) నార్వేలో టేకాఫ్ అయిన 40 సెకన్లకే ఒక రాకెట్ కూలిపోవడంతో యూరప్ అంతరిక్ష కార్యక్రమం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో రాకెట్ ఆకాశంలోనే పేలిపోతున్నట్లు కనిపించింది.

ఈ రాకెట్ యూరప్ నుండి ఉపగ్రహ ప్రయోగాలను వేగవంతం చేయడానికి అభివృద్ధి చేయడం జరిగింది. అయితే, టేకాఫ్ అయిన వెంటనే అది నేలపై కూలిపోయింది. జర్మన్ స్టార్టప్ ఇసార్ ఏరోస్పేస్ దీనిని ప్రారంభ పరీక్షగా అభివర్ణించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం స్పెక్ట్రమ్ రాకెట్ యూరప్ నుండి విజయవంతమైన ప్రయోగానికి ప్రయత్నిస్తోంది. ఈ మిషన్ గురించి, స్వీడన్, బ్రిటన్, ఇతర దేశాలు వాణిజ్య అంతరిక్ష మిషన్‌లో పాల్గొనాలనే కోరికను వ్యక్తం చేశాయి. అయితే, ప్రారంభ ప్రయోగం ఊహించిన దానికంటే ముందే ముగియవచ్చని ఇసార్ ఏరోస్పేస్ ఇప్పటికే హెచ్చరించింది. రాకెట్ పేలుడు జరిగినప్పటికీ, ఈ సంఘటన భవిష్యత్ మిషన్లకు ఉపయోగపడే ముఖ్యమైన డేటాను అందించిందని కంపెనీ తెలిపింది.

AFP కథనం ప్రకారం, ప్రయోగానికి ముందు, ఇసార్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, CEO డేనియల్ మెట్జ్‌లర్ కీలక ప్రటన చేశారు. “ప్రతి విమానం మాకు ముఖ్యమైనది, ఎందుకంటే అది మాకు డేటా, అనుభవాన్ని ఇస్తుంది. 30 సెకన్ల విమానం మాకు పెద్ద విజయం అవుతుంది.” ఈ పరీక్ష ద్వారా కంపెనీ కక్ష్యకు చేరుకుంటుందని ఊహించలేదని ఆయన అన్నారు. నిజానికి, ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా తన మొదటి కక్ష్య ప్రయోగ వాహనాన్ని కక్ష్యలోకి విజయవంతంగా సర్దుబాటు చేయలేకపోయిందని ఆయన అన్నారు.

నార్వేలోని ఆర్కిటిక్ ఆండోయా అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన స్పెక్ట్రమ్ రాకెట్, చిన్న, మధ్య తరహా ఉపగ్రహాలను (ఒక మెట్రిక్ టన్ను వరకు బరువు) ప్రయోగించడానికి రూపొందించారు. అయితే, ఈ మొదటి టెస్ట్ ఫ్లైట్ ఎటువంటి పేలోడ్‌ను మోయలేదు. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశ్యం తమ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రయోగ వాహనం. అన్ని వ్యవస్థల మొదటి ఇంటిగ్రేటెడ్ పరీక్షను నిర్వహించడం అని బవేరియన్ ఇసార్ ఏరోస్పేస్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. NSF (నేషనల్ స్పేస్ ఫోరం) ఒక వీడియోను షేర్ చేస్తూ, “లాంచ్! ఇసార్ ఏరోస్పేస్ స్పెక్ట్రమ్ రాకెట్ నార్వేలోని ఆండోయా స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు. కానీ అది మొదటి దశలో విఫలమైంది” అని రాసింది. ప్రయోగించిన కొన్ని సెకన్ల తర్వాత రాకెట్ పేలిపోయిందని, ఈ పరీక్ష విఫలమైందని వీడియోలో స్పష్టంగా కనిపించింది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..