Gmail Hacking: గిఫ్ట్‌ కార్డ్స్‌ అంటూ మెయిల్స్‌ వస్తున్నాయా..? క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Oct 12, 2021 | 4:27 PM

Gmail Hacking: ఇంటర్‌నెట్‌ విస్తృతి ఎలా అయితే పెరుగుతుందో అదే స్థాయిలో హ్యాకర్లు కూడా రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోకి చొరబడుతూ వ్యక్తిగత సమాచారాన్ని..

Gmail Hacking: గిఫ్ట్‌ కార్డ్స్‌ అంటూ మెయిల్స్‌ వస్తున్నాయా..? క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే..
Follow us

Gmail Hacking: ఇంటర్‌నెట్‌ విస్తృతి ఎలా అయితే పెరుగుతుందో అదే స్థాయిలో హ్యాకర్లు కూడా రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోకి చొరబడుతూ వ్యక్తిగత సమాచారాన్ని గాజేస్తున్నారు. ఇప్పటి వరకు యాప్‌లు, మెసేజ్‌ల రూపంలో యూజర్లను టార్గెట్‌ చేసిన హ్యాకర్లు ఇప్పుడు మరో కొత్త పంథాను ఎంచుకున్నారు. జీమెయిల్‌, అవుట్‌ లుక్‌ యూజర్లను టార్గెట్‌ చేసుకొని వల విసురుతున్నారు. ఇటీవల బయటకొచ్చిన ఈ మెయిల్‌ స్కామ్‌తో ఇప్పటికే చాలా మంది యూజర్లు హ్యాకర్ల బారినపడ్డట్లు సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ కొత్త రకం హ్యాకింగ్‌ ఎలా జరుగుతందంటే..

ముందుగా ఈ మెయిల్‌ ఐడీకి గిఫ్ట్‌ కార్డుల పేరిట ఓ మెయిల్‌ వస్తుంది. ఏదో షాపింగ్‌ చేసి సమయంలో మీకు క్యాష్‌ బ్యాక్‌ వచ్చిందనో మరెదో ఆశ చూపి మెయిల్‌ వస్తుంది. అయితే పేరు తెలియని వాటి నుంచి మెయిల్స్‌ వస్తే పెద్దగా యూజర్లు స్పందించరనే కారణంతో పెద్ద పెద్ద బ్రాండ్‌ల నుంచి మెయిల్స్‌ పంపిస్తారు. తీరా ఆ బహుమతిని క్లైమ్‌ చేసుకుందామని లింక్‌ను క్లిక్‌ చేయగానే చిన్న సర్వేలో పాల్గొనండి అంటూ ఓ లింక్‌ చూపిస్తుంది. పొరపాటు ఆ లింక్‌ను క్లిక్‌ చేశారో ఇక మీ పని పంతే. వెంటనే మీ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌లోని వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.

దీంతో మీ బ్యాంకు ఖాతాలను హ్యాకర్లు యాక్సెస్‌ చేసేస్తారు. ఇదిలా ఉంటే హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే సైబర్‌ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. తెలియని లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదని, అనధికారిక వెబ్‌సైట్‌లలో మీ వ్యక్తిగత వివరాలను ఇవ్వకూడదని సూచిస్తున్నారు. బ్యాంకు కార్డుల వివరాలను, పాస్‌వర్డ్‌లను పంచుకోకూడదని హెచ్చరిస్తున్నారు.

Also Read: Rashid Khan: టాప్ ఫైవ్ టీ20 ఆటగాళ్లను ఎంపిక చేసిన రషీద్ ఖాన్.. ఇండియా నుంచి ఇద్దరికి చోటు.. ఎవరెవరు ఉన్నారంటే..

ఆర్‌సీబీ హిట్ పెయిర్లలో కోహ్లీదే అగ్రస్థానం.. సీజన్లు మారినా, భాగస్వామ్యాలు మారినా బెంగళూరుతోనే ప్రయాణం

Huzurabad Election: హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్ సీనియర్లు.. పార్టీ అభ్యర్థిని ఎందుకు ఒంటరిని చేశారు?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu