అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం.. గూగుల్, ఛాట్‌జీపీటీలకు పోటీగా…
గూగుల్ జెమినీ, ఛాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌కు పోటీగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రంగంలోకి దిగారు. కొత్త ఏఐ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీకి జెఫ్ బెజోస్ సీఈవోగా ఉండనున్నారు. గతంలో అమెజాన్ కంపెనీ నుంచి వైదొలగిన ఆయన.. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఈ కీలక పగ్గాలు చేపట్టడం విశేషం.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ తిరిగి సీఈవో బాధ్యతలను తీసుకున్నారు. జెఫ్ బెజోస్ త్వరలో ఆర్టిపిషీయల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా కొత్త ఏఐ వెంచర్‌ను ప్రారంభించారు. దీని కోసం 6.2 బిలియన్ల డాలర్లను ఫండింగ్ చేయనున్నారు. ఈ కొత్త స్టార్టప్ కంపెనీకి జెఫ్ బెజోస్ సీఈవోగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
జులై 2021లో అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి బెజోస్ తప్పుకున్నారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త మళ్లీ కొత్త కంపెనీకి సీఈవో బాధ్యతలను స్వీకరించనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త ఏఐ స్టార్టప్ కంపెనీ పేరు ప్రాజెక్ట్ ప్రోమేతియన్ అని తెలుస్తోంది. కంప్యూటర్లు, ఏరోస్సేస్, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్ తయారీ రంగాలకు సంబంధించి ఏఐని ఉపయోగించడంపై పని చేయనుంది.
ప్రముఖ సిలికాన్ వ్యాలీ రీసెర్చర్ విక్ బజాజ్ కూడా ఈ కంపెనీలో సహ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించనున్నారు. గతంలో విక్ బజాజ్ గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్‌తో కలిసి ఎక్స్ ల్యాబ్, లైఫ్ సైన్సెస్ పరిశోధనల్లో యూనిట్ సహ వ్యవస్థాపకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. జెఫ్ బెజోస్ సీఈవోగా ఉన్న ఈ కొత్త కంపెనీ ఇప్పటికే ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా సంస్థల్లో పనిచేసిన 100 మంది ఉద్యోగులను నియమించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ కొత్త కంపెనీ ఏఐ రంగంలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుంది అనేది టెక్ వర్గల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి జెఫ్ బెజోస్ ఏఐ రంగంలో ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తారో చూడాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




