- Telugu News Photo Gallery Spiritual photos If you do these things on a new moon day, you will be at risk, even science has proven.
అమావాస్య రోజున ఈ పనులు చేస్తే.. మీకే రిస్క్.. ఇదుగో ప్రూఫ్..
ప్రతీ నెల అమావాస్య, పౌర్ణమి రావడం సర్వసాధారం. హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు . ఈరోజు చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న అమావాస్య రోజు కొన్ని పనులకు చేయకూడదుని పండితులు చెబుతూ ఉంటారు. అయితే కేవలం ఆచారంగానే కాకుండా సైన్స్ సైతం ఈ విషయం నిజమని చెబుతోంది.. మరి ఏంటా పనులు.? ఈరోజు తెలుసుకుందాం.
Updated on: Nov 18, 2025 | 6:20 PM

ప్రయాణాలు: అమావాస్య రోజు వీలైనంత వరకు ప్రయాణాలు చేయకూడదన్నది పెద్దల మాట. అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నమ్ముతారు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తుంటారు.

కొత్త వస్తువులు కొనడం: అమావాస్య రోజున కొత్త దుస్తులు, కొత్త వాహనాలు కొనుగోలు నెగిటివ్‌కు సూచికగా చెబుతుంటారు. అలాగే కొత్త పనిని అమావాస్య రోజున ప్రారంభించకూడదు. ఎట్టి పరస్థితుల్లో కటింగ్, షేవింగ్, గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి అమావాస్య రోజు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.

శుభకార్యాలు: అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యక్రమాలు జరగవని మనిందరికీ తెలిసిందే. వివాహం మొదలు చిన్న చిన్న శుభ కార్యాలను కూడా అమావాస్య రోజున నిర్వహించారు. అంతేకాదు ఈ రోజు నిర్మాణ పనులు కూడా చేపట్టరు. ముఖ్యంగా వృధా ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతుంటారు.

మాంసాహారం: అమావాస్య రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలని కూడా పండితులు చెబుతుంటారు. శాస్త్రంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. వీలైనంత వరకు ఆకు కూరలను తినాలని అంటారు.

భార్యాభర్తలు: అలాగే అమావాస్య రోజున భార్యభర్తలు శారీరకంగా కలవడం వాళ్ళ ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో సృష్టి కార్యంలో పాల్గొనడం వల్ల సంతాన సమస్యలతో పాటు ఆలుమగల మధ్య ఇబ్బందులు వస్తాయని చెబుతుంటారు.




