TRAI: కోట్లాది మంది వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ట్రాయ్ ఆర్డర్‌తో టెలికాం కంపెనీలు కీలక నిర్ణయం!
TRAI: గత ఏడాది ఆగస్టులో ట్రాయ్ ల్యాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవా నాణ్యత నిబంధనల ను సవరించింది. టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం ఆపరేటర్లను వెబ్‌సైట్‌లో జియోస్పేషియల్ నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను ప్రచురించాలని ఆదేశించింది. ఈ మ్యాప్‌లో వైర్‌లెస్ వాయిస్ లేదా..

టెలికాం కంపెనీలపై ట్రాయ్ (TRAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు ట్రాయ్ టెలికాం కంపెనీలపై చర్యలు చేపడుతూనే ఉంటుంది. టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా తమ 5G, 4G,2G కవరేజ్ మ్యాప్‌లను వెబ్‌సైట్, యాప్‌లలో ప్రచురించాయి. వినియోగదారులు ఆపరేటర్‌ను ఎంచుకోవడంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటానికి టెలికాం కంపెనీలను వారి వెబ్‌సైట్‌లు, యాప్‌లలో నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను ప్రచురించాలని టెలికాం రెగ్యులేటర్ ఇటీవల ఆదేశించింది.
MNP నియమాల ప్రకారం.. మొబైల్ వినియోగదారులు కొత్త సిమ్ కొనుగోలు చేసిన 90 రోజుల తర్వాత మాత్రమే తమ నంబర్‌ను మరొక ఆపరేటర్‌కు పోర్ట్ చేయవచ్చు. సిమ్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ ప్రాంతంలో ఏ టెలికాం ఆపరేటర్ నెట్‌వర్క్ మంచిదో తెలియదు. వినియోగదారుల ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని టెలికాం రెగ్యులేటర్ ఇటీవల టెలికాం కంపెనీలను వెబ్‌సైట్ లేదా యాప్‌లో తమ నెట్‌వర్క్ కవరేజ్ వివరణాత్మక మ్యాప్‌ను పొందుపర్చాలని ట్రాయ్ ఆదేశించింది. దీని వల్ల వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌ను వాడితే బాగుంటుందో సులభంగా తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Jio Annual Plan: రూ.601ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ.. జియో నుంచి దిమ్మదిరిగే రీఛార్జ్ ప్లాన్!
గత ఏడాది ఆగస్టులో ట్రాయ్ ల్యాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవా నాణ్యత నిబంధనలను సవరించింది. టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం ఆపరేటర్లను వెబ్‌సైట్‌లో జియోస్పేషియల్ నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను ప్రచురించాలని ఆదేశించింది. ఈ మ్యాప్‌లో వైర్‌లెస్ వాయిస్ లేదా బ్రాడ్‌బ్యాండ్ సేవ ఎక్కడ అందుబాటులో ఉందో వినియోగదారులకు తెలుస్తుంది.
టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) తన అధికారిక X హ్యాండిల్ నుండి టెలికాం ఆపరేటర్లు ప్రచురించిన కవరేజ్ మ్యాప్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. తద్వారా వినియోగదారులు ఇప్పుడు ఆపరేటర్‌ను ఎంచుకునే ముందు కవరేజ్ మ్యాప్‌ను తనిఖీ చేయగలరని తెలుసుకోవచ్చు. ఈ ఆర్డర్ తర్వాత దేశంలోని 120 కోట్ల మొబైల్ వినియోగదారులు ఉపశమనం కలుగనుంది. కొత్త టెలికాం ఆపరేటర్‌ను ఎంచుకోవడంలో ప్రస్తుత వినియోగదారులు కవరేజ్ మ్యాప్ సహాయం తీసుకోవచ్చు. దాని కవరేజ్ ఎలా ఉందో పూర్తి వివరాలు తెలుసుకోవడం సులభం అవుతుంది.
Mobile Coverage Maps are here!
Check operator wise coverage of your Telecom network in your area across India on TRAI & TSPs website. pic.twitter.com/La20376Pw4
— DoT India (@DoT_India) April 10, 2025
120 కోట్ల మంది వినియోగదారులకు ఉపశమనం:
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కవరేజ్ మ్యాప్‌లను ప్రచురించడం వల్ల వినియోగదారులు, TSP మధ్య పారదర్శకత కొనసాగుతుందని ట్రాయ్(TRAI) తన ప్రకటనలో పేర్కొంది. ట్రాయ్ ఆదేశం ప్రకారం టెలికాం కంపెనీలు వెబ్‌సైట్‌లు, యాప్‌లలో కవరేజ్ మ్యాప్‌ల వివరాలను ఇచ్చాయి. ప్రభుత్వ టెలికాం కంపెనీలు BSNL కూడా దాని నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌ను అందించింది.
మీ మొబైల్ నెట్‌వర్క్ కవరేజీని తెలుసుకోవడం ఎలా?
వినియోగదారులు TRAI వెబ్‌సైట్ www.trai.gov.inని సందర్శించి తమకు నచ్చిన సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవడానికి కన్స్యూమర్ సమాచారం అందించి నెట్‌వర్క్ కవరేజీని తెలుసుకోవచ్చు.
- ముందుగా ట్రాయ్ అధికారిక వెబ్‌సైట్ www.trai.gov.inలోకి వెళ్లాలి.
- ఆ తర్వాత Consumer Infoపై క్లిక్ చేయగానే అందులో Mobile Coverage Map అని కనిపిస్తుంది. దానినిపై క్లిక్ చేయాలి.
- అందులో ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ కనిపిస్తుంటుంది.
- అక్కడ మీరు వాడే నెట్‌వర్క్‌ను క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బాక్స్‌లో మీ నివసించే ప్రదేశం పిన్ కోడ్ నంబర్‌ను ఎంటర్ చేయగానే నెట్‌వర్క్ మ్యాప్ కనిపిస్తుంది. దీంతో కవరేజ్ ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Price: అక్షయ తృతీయకు ముందు భగ్గుమంటున్న బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
