ల్యాండ్​లైన్​ నుంచి మొబైల్‌కు ఫోన్ చేయాలా.. అయితే మీరు ఈ నెంబర్ నొక్కాల్సిందే.. లేకుంటే కష్టమే..

కొత్త నిబంధనలను తెరమీదికి తీసుకొచ్చింది టెలికాం శాఖ. ఇక ముందు ల్యాండ్​లైన్​ నుంచి మొబైల్‌కు ఫోన్ చేయాలంటే సున్నా (0) డయల్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ ప్రతిపాదనను ఇవాళ్టి నుంచి...

ల్యాండ్​లైన్​ నుంచి మొబైల్‌కు ఫోన్ చేయాలా.. అయితే మీరు ఈ నెంబర్ నొక్కాల్సిందే.. లేకుంటే కష్టమే..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 15, 2021 | 2:37 PM

BSNL Remind Users : కొత్త నిబంధనలను తెరమీదికి తీసుకొచ్చింది టెలికాం శాఖ. ఇక ముందు ల్యాండ్​లైన్​ నుంచి మొబైల్‌కు ఫోన్ చేయాలంటే సున్నా (0) డయల్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ ప్రతిపాదనను ఇవాళ్టి నుంచి నుంచి అమల్లోకి వచ్చేసింది.

టెలికాం శాఖ ఆదేశాల మేరకు తమ ఖాతాదారులకు ఆయా సంస్థలు ఈ మేరకు సమాచారం అదించాయి. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే శుక్రవారం( జనవరి 15) నుంచి ఫోన్​ నంబర్ ముందు సున్నాను తప్పనిసరిగా చేర్చాల్సివుంటుందని పేర్కొంది.టెలికాం శాఖ ఆదేశాల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నాయి అన్ని టెలికాం సంస్థలు.

2021జనవరి 15 నుంచి ల్యాండ్‌లైన్‌ల నుంచి మొబైల్‌కు ఫోన్ చేయాలంటే మొబైల్ సంఖ్యకు మందు సున్నా చేర్చాలని గతేడాది నవంబర్‌లోనే టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఫోన్ నంబర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఫలితంగా దాదాపు 2,539 మిలియన్ల నంబర్ సిరీస్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా.