WhatsApp: మరోసారి ప్రశ్నార్థకంగా మారిన వాట్సాప్ యూజర్ల ప్రైవసీ… గూగుల్‌లో ప్రత్యక్షమవుతోన్న యూజర్ల ఫోన్ నెంబర్లు..
WhatsApp Web Numbers In Google: ప్రస్తుతం ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై జరుగుతోన్న చర్చ అంతా ఇంత కాదు. వాట్సాప్ ప్రవేశపెట్టనున్న కొత్త ప్రైవసీ పాలసీతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి..
WhatsApp Web Numbers In Google: ప్రస్తుతం ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై జరుగుతోన్న చర్చ అంతా ఇంత కాదు. వాట్సాప్ ప్రవేశపెట్టనున్న కొత్త ప్రైవసీ పాలసీతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పువాటిల్లనుందని ప్రచారం జరుగుతోన్న వేళ వాట్సాప్ అన్ఇన్‌స్టాల్‌లు బాగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ఎప్పుడూ లేని విధంగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌ల డౌన్‌లోడ్‌లు పెరిగిపోతున్నాయి.
ఇదిలా ఉంటే ఇంకా వాట్సాప్ ప్రైవసీ పాలసీ దుమారం తగ్గకముందే మరో కలకలం మొదలైంది. గూగుల్ సెర్చ్‌లో ఇండెక్సింగ్ ద్వారా వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నెంబర్లు దర్శనమిచ్చాయి. సాధారణంగా వాట్సాప్‌ను మొబైల్ వెర్షన్‌లోనే కాకుండా డెస్క్‌టాప్‌లోనూ వాడుతుంటారు. ఇలా డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఉపయోగించే వెబ్ యూజర్ల వ్యక్తిగత నెంబర్లు ప్రత్యక్షమయ్యాయని ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు రాజశేఖర్ రాజహరియా తెలిపారు. అంతటితో ఆగకుండా గూగుల్ సెర్చ్‌లో కనిపించిన వాట్సాప్ వెబ్ యూజర్ల వ్యక్తిగత ఇండెక్సింగ్ నెంబర్లను ఆన్‌లైన్ వేదికగా షేర్ చేశారు. సాధారణంగా ఎవరైనా వెబ్ వెర్షన్ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గూగుల్ సెర్చ్‌లో మొబైల్ నంబర్లు ఇండెక్స్ అవుతాయి. అయితే ఇప్పుడీ నెంబర్లు లీక్ కావడం కలకలం రేపాయి. దీంతో ఈ సంఘటనపై స్పందించిన వాట్సాప్.. ఇలాంటి చాట్‌లను ఇండెక్స్ చేయవద్దని గూగుల్‌ను కోరినట్టు తెలిపింది. అయితే, వాట్సాప్ చెప్పినప్పటికీ గూగుల్ ఇంకా ఇండెక్స్ చేస్తూనే ఉందని రాజహరియా తెలిపారు.
Also Read: TRP Scam: టీఆర్‌పీ కుంభకోణం కేసులో ఊహించని మలుపు.. అర్నాబ్ గోస్వామి వాట్సాప్ సందేశాలు లీక్..!