TV Prices: కొత్తేడాదిలో టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే తొందరపడండి… ఎందుకో తెలుసా..?
TV Prices May Increase: కొత్తేడాది ఏదైనా కొత్త వస్తువు కొనాలని చాలా మంది భావిస్తుంటారు. వారి అవసరాలకు అనుగుణంగా ఇంట్లో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటారు. మీరు కూడా..
TV Prices May Increase: కొత్తేడాది ఏదైనా కొత్త వస్తువు కొనాలని చాలా మంది భావిస్తుంటారు. వారి అవసరాలకు అనుగుణంగా ఇంట్లో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటారు. మీరు కూడా ఈ సందర్భంగా టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే మాత్రం వెంటనే త్వరపడండి. ఎందుకంటే టీవీ ధరలు పెరగనున్నాయి. వచ్చే త్రైమాసికంలో టీవీల ధరలను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయని సమాచారం. కంపోనెంట్ ప్యానెళ్ల ధరలు అమాంతం పెరగడంతో టీవీల ధరలను పెంచాలనే యోచనలో కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది. ఓపెన్ సెల్ డిస్ల్పే ప్యానెల్ ధర ఒక్కసారిగా భారీగా పెరిపోయాయని, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల కొరత ప్రపంచవ్యాప్తంగా ఏర్పడడంతో వీటి ధర అమాంతం పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాలతో టీవీల తయారీ ఖర్చు పెరిగాయని.. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు టీవీల ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే 32 అంగుళాల టీవీ ప్యానెళ్ల ధర 33 డాలర్ల నుంచి 35 డాలర్లకు పెరిగాయి. ఇక భారత టీవీ మార్కెట్లో షియామీ, శాంసంగ్, వన్ ప్లస్ టీవీ బ్రాండ్ల ధరలు ఇప్పటికే 10శాతం నుంచి 15 శాతం పెరిగాయి.