Xiaomi Reaction: షియోమీకి షాక్ ఇచ్చిన అమెరికా రక్షణ శాఖ.. తీవ్రంగా స్పందించిన కంపెనీ యాజమాన్యం.. కీలక ప్రకటన విడుదల..

Xiaomi Reaction: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షియోమిని బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ అమెరికా రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయంపై..

Xiaomi Reaction: షియోమీకి షాక్ ఇచ్చిన అమెరికా రక్షణ శాఖ.. తీవ్రంగా స్పందించిన కంపెనీ యాజమాన్యం.. కీలక ప్రకటన విడుదల..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 6:59 PM

Xiaomi Reaction: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీని బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ అమెరికా రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయంపై షియోమీ యాజమాన్యం స్పందించింది. అమెరికా ప్రభుత్వం చర్యను తోసిపుచ్చింది. సంస్థ ప్రయోజనాలకు కాపాడేందుకు తగు చర్యలు చేపడతామని ప్రకటించింది. వాణిజ్య చట్టాలకు అనుగుణంగానే కంపెనీ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందని షియోమీ స్పష్టం చేసింది. ఆ మేరకు శుక్రవారం షియోమీ కార్పొరేషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. పారిశ్రామిక, వాణిజ్య చట్టాలు, ప్రభుత్వ నిబంధనల మేరకే కంపెనీ ప్రోడక్ట్స్‌ ఉత్పత్తి చేస్తోందని షియోమి ఉద్ఘాటించింది.

‘షియోమీ చైనా మిలిటరీ ఆధీనంలో లేదు. కంపెనీని చైనా ఆర్మీ నియంత్రించడం లేదు. ఆ దేశ ఆర్మీతో కంపెనీకి ఎలాంటి అనుబంధం లేదు. అమెరికా ప్రభుత్వం ఆరోపించినట్లు షియోమీ కమ్యూనిస్ట్ చైనీస్ మిలిటరీ కంపెనీ కాదు. ఇది ఒక వ్యాపార సంస్థ. ఎంతోమంది కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అందరి భాగస్వామ్యంతో సంస్థ నడుస్తోంది. అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన నేపథ్యంలో సంస్థ, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుంది.’ అని షియోమీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. భవిష్యత్ పరిణామాలపై సరైన సమయంలో స్పందిస్తాం అని సంస్థ యాజమాన్యం తెలిపింది.

కాగా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా గుర్తింపు పొందిన షియోమీకి ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. చైనా సైన్యంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ అమెరికా రక్షణ శాఖ షియోమిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ మేరకు 2021, జనవరి 14వ తేదీన యూఎస్ రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also read:

Arjun Tendulkar makes Debut: ముంబై సీనియర్ జట్టులో అడుగు పెట్టిన లిటిల్ మాస్టర్ వారసుడు అర్జున్

సోయగాలతో కవ్విస్తున్న సొగసరి.. పసుపు చీరలో మెరిసిన బాపు బొమ్మ ప్రణీత.