Whats App: యూజర్లు దూరమవుతోన్న వేళ మరో వివరణ ఇచ్చిన వాట్సాప్… ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు..
Whatsapp New Statement About Privacy Policy: ఏమంటూ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించిందో అప్పటి నుంచి రచ్చ మొదలైంది. యూజర్ల వ్యక్తిగత భద్రతను వాట్సాప్ ప్రశ్నార్థకంగా..
Whatsapp New Statement About Privacy Policy: ఏమంటూ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించిందో అప్పటి నుంచి రచ్చ మొదలైంది. యూజర్ల వ్యక్తిగత భద్రతను వాట్సాప్ ప్రశ్నార్థకంగా మార్చేస్తోందంటూ అందరూ గగ్గోలు పెట్టారు. కేవలం ఆరోపించడమే కాకుండా యాప్‌ను కూడా చాలా మంది అన్ ఇన్‌స్టాల్ చేశారు. వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ప్రైవసీ పాలసీకి ఓకే చెప్పేది లేదంటూ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు మొగ్గుచూపారు. ఈ కారణంగా యాప్‌ల డౌన్‌లోడ్‌లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు ప్రకటనలు చేసిన యాజమాన్యం తాజాగా మరో వివరణ ఇచ్చింది. తమ నూతన ప్రైవసీ పాలసీపై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమిస్తామని వాట్సాప్ హెడ్ విల్‌చాత్‌కార్ట్ పేర్కొన్నారు. యూజర్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొనడంలో సిగ్నల్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడతామని తేల్చి చెప్పారు. మరి వాట్సాప్‌పై యూజర్లలో నమ్మకం కలుగుతుందా లేదా.. ఇతర యాప్‌ల జోరు ఇలాగే కొనసాగుతుందా చూడాలి.