What’s App Privacy Policy: ఆ వార్తలన్ని అవాస్తవం.. మీ డేటా భద్రతకు మేం రక్షణ.. క్లారిటీ ఇచ్చిన వాట్సప్..

వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధన ప్రవేశపెట్టిన క్రమంలో దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. వాట్సప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ రూల్‏ను అంగీకరిస్తే

What's App Privacy Policy: ఆ వార్తలన్ని అవాస్తవం.. మీ డేటా భద్రతకు మేం రక్షణ.. క్లారిటీ ఇచ్చిన వాట్సప్..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 1:04 PM

వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధన ప్రవేశపెట్టిన క్రమంలో దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. వాట్సప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ రూల్‏ను అంగీకరిస్తే.. మన వ్యక్తిగత సమాచారం మొత్తం స్టోరేజీ చేసుకుందని.. అలాగే ఫేస్‏బుక్ యాడ్లకు వినియోగించబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఈ యాప్‏ను అన్ ఇన్‏స్టాల్ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాకుండా డిస్‏లైక్ చేయడం చేస్తున్నారు. అంతేకాకుండా వాట్సప్‏కు ప్రత్య్నామయంగా వేరే యాప్‏ల వైపు మక్కువ చూపిస్తున్నారు. దీంతో వాట్సప్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ఈ వార్తలపై వాట్సప్ స్పందించింది. ప్రైవసీ పాలసీ గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని.. వాటికి సమాధానం చెప్పడం తమ బాధ్యత అని సోషల్ మీడియా వేదికగా వాట్సప్ స్పష్టం చేసింది. ఇక ఈ పుకార్లను అధిగమించేందుకు వాట్సప్ ముందుకు వచ్చింది. యూజర్ల వ్యక్తిగత వివరాలు ఎక్కడ స్టోరేజ్ అవ్వవని.. అలాగే వారి భద్రత గోప్యతకు తాము రక్షణగా ఉంటామని ప్రకటించింది.

అంతేకాకుండా అందుకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా వెల్లడించింది. ☛ ఫేస్‌బుక్‌కు వాట్సాప్‌ వివరాలు పంపుతాం అనేది వాస్తవం కాదు. మేము ఎలాంటి వివరాలను షేర్ చేసుకోం. అలాగే వ్యక్తిగత చాట్ వివరాలు షేర్ చేయ్యం. ☛ కొత్తగా ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నాం. కొత్త నిబంధనలను అంగీకరిస్తేనే వాట్సప్‌ వినియోగానికి అర్హులు. లేదంటే వారి ఖాతాను తొలగించేస్తాం. ☛ కొత్తగా అప్డేట్‌ చేసిన వెర్షన్‌‏ను ఫిబ్రవరిలో అమల్లోకి తెస్తాం. వాట్సప్‏కు 400 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. ☛ ఫేస్‌బుక్‌కు మీ కాంటాక్ట్స్‌ వివరాలను పంచుకోము. ☛ వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్‌ చేయము. ☛ మీ వివరాలన్నింటి విషయంలో గోప్యత పాటిస్తాం. ☛ మీరు సందేశాలు కనిపించకుండా చేసుకోవచ్చు. ☛ మీరు పంపిన లోకేషన్స్‌ కూడా వాట్సప్‌ పర్యవేక్షించదు.