Google India: ఆన్‌లైన్ రుణ యాప్‌లపై కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్.. అలాంటి అప్లికేషన్‌లను తొలగిస్తున్నట్లు..
Google India Removes Money Lending Apps: అడిగిన వెంటనే అప్పులు ఇచ్చి ఆ తర్వాత వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోన్న ఆన్‌లైన్ మనీ యాప్‌ల గురించి ప్రత్యేకంగా..
Google India Removes Money Lending Apps: అడిగిన వెంటనే అప్పులు ఇచ్చి ఆ తర్వాత వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోన్న ఆన్‌లైన్ మనీ యాప్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక కష్టాలతో ఇలాంటి యాప్‌ల ట్రాప్‌లో పడ్డ కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం. సదరు యాప్ నిర్వాహకులు పెడుతోన్న టార్చర్ భరించలేక కొందరు, ఎక్కడ పరువు పోతుందో అని మరి కొందరు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గూగుల్ ఇండియా ఇలాంటి రుణ యాప్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్‌లో ప్రభుత్వ నిబంధనలను, తమ యూజర్ సెఫ్టీ పాలసీలను ఉల్లంఘించిన యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. అలాగే, యాప్‌ల డెవలపర్లు సంబంధిత సంస్థలు స్థానిక ప్రభుత్వ చట్టాలను అనుసరిస్తున్నారా? లేదా? అన్న సంగతిని నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గూగుల్ ఇప్పటి వరకు 10 భారతీయ లోన్ యాప్ లపై చర్యలు తీసుకుంది. వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇక మిగిలన యాప్‌లు కూడా స్థానిక చట్టాలకు లోబడి ఉన్నాయో.. లేవో తెలపాలని ఆయా యాప్ నిర్వాహకులను గూగుల్ ప్రొడక్ట్, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ సుజన్న ఫ్రే కోరారు.
Also Read: What’s App: సిగ్నల్ యాప్‌కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..