Airtel Spam Report: ఎయిర్‌టెల్ ఇప్పటి వరకు ఎన్ని స్పామ్ కాల్స్‌ను గుర్తించిందో తెలుసా? రిపోర్ట్ విడుదల
అనేక పారామీటర్లను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఏఐ ఆధారిత వ్యవస్థ ఈ అవాంఛిత ప్రయత్నాలను రియల్ టైమ్‌లో కచ్చితత్వంతో గుర్తించగలిగింది. ఈ అద్భుతమైన ప్రయత్నం భారతదేశంలో పెరుగుతున్న స్పామ్ ముప్పుకు సమగ్ర పరిష్కారాన్ని..
ఎయిర్‌టెల్ తన స్పామ్ వ్యతిరేక సొల్యూషన్ ప్రారంభించినప్పటి నుండి తన నెట్‌వర్క్‌లో గమనించిన విషయాలకి సంబంధించిన స్పామ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. భారతదేశపు మొట్టమొదటి స్పామ్ కాల్స్‌కు చెక్‌పెట్టే నెట్‌వర్క్ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన ఏఐ ఆధారిత, స్పామ్-ఫైటింగ్ సొల్యూషన్ ప్రారంభించిన రెండున్నర నెలల్లోనే 8 బిలియన్ స్పామ్ కాల్స్, 0.8 బిలియన్ స్పామ్ ఎస్ఎంఎస్ లకు అడ్డుకట్ట వేసింది. ఈ అధునాతన అల్గారిథమ్ ఉపయోగించి, ఏఐ ఆధారిత నెట్వర్క్ ప్రతిరోజూ 1 మిలియన్ స్పామర్లను విజయవంతంగా గుర్తించింది.
గత 2.5 నెలల్లో ఈ స్పామ్ కాల్స్ గురించి కంపెనీ దాదాపు 252 మిలియన్ల ప్రత్యేక కస్టమర్లను అలర్ట్ చేసింది. వాటికి సమాధానం ఇచ్చే కస్టమర్ల సంఖ్య 12% తగ్గిందని గమనించింది. ఎయిర్ టెల్ నెట్ వర్క్‌లోని మొత్తం కాల్స్‌లో ఆరు శాతం స్పామ్ కాల్స్ గా, మొత్తం ఎస్ఎంఎస్‌లలో 2 శాతం స్పామ్ గా గుర్తించారు. స్పామర్లలో 35% మంది ల్యాండ్ లైన్ టెలిఫోన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించింది.
ఇంకా, ఢిల్లీలోని కస్టమర్లకు అత్యధికంగా స్పామ్ కాల్స్ వచ్చాయి. తరువాత ఏపీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని కస్టమర్లు ఉన్నారు. స్పామ్ కాల్స్ ఎక్కువగా ఢిల్లీలోనే ఉండగా, ఆ తర్వాత ముంబై, కర్ణాటక ఉన్నాయి. ఎస్ఎంఎస్‌ల విషయానికొస్తే గుజరాత్ నుంచి అత్యధికంగా, ఆ తర్వాత కోల్‌కతా, ఉత్తర్ ప్రదేశ్‌ల నుంచి వస్తున్నట్లు ఎయిర్‌టెల్ గుర్తించింది. అత్యధికంగా ముంబై, చెన్నై, గుజరాత్ ల నుంచి కస్టమర్లను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నాయని గుర్తించింది.
ఇది కూడా చదవండి: SIM Card: మీ పేరుపై ఎవరైనా సిమ్ కార్డును వాడుతున్నారా? తెలుసుకోవడం ఎలా?
మొత్తం స్పామ్ కాల్స్‌లో 76 శాతం మగ కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. అదనంగా, వయస్సు జనాభాలో స్పామ్ కాల్ ఫ్రీక్వెన్సీ పరంగా స్పష్టమైన తేడాలు గుర్తించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. 36-60 సంవత్సరాల మధ్య వయస్సు గల కస్టమర్లు మొత్తం స్పామ్ కాల్స్‌లో 48% ఉన్నారు. 26-35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు రెండవ స్థానంలో ఉన్నారు. వీరికి 26% స్పామ్ కాల్స్ ఉన్నాయి. కేవలం 8 శాతం స్పామ్ కాల్స్ మాత్రమే సీనియర్ సిటిజన్ల హ్యాండ్ సెట్లలోకి వస్తున్నాయని గుర్తించింది.
స్పామ్ యాక్టివిటీ గంట వారిగా సమాచారం గురించి కంపెనీ గుర్తించింది. స్పామ్ కాల్స్ ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతాయి. రోజు గడిచేకొద్దీ క్రమంగా పెరుగుతాయి. మధ్యాహ్నం నుంచి 3 గంటల మధ్య స్పామ్ యాక్టివిటీ ఎక్కువగా ఉందని గమనించింది. ఈ సమయంలో స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాక వారం చివర రోజులు, వారం మధ్యలో స్పామ్ కాల్స్ ఫ్రీక్వెన్సీలో చాలా వ్యత్యాసం ఉంది. ఆదివారాల్లో ఈ కాల్స్ పరిమాణం 40 శాతం తగ్గుతుంది. ముఖ్యంగా రూ.15,000 నుంచి రూ.20,000 ధరల రేంజ్ లో ఉన్న మొబైళ్లలో మొత్తం స్పామ్ కాల్స్‌ల్లో సుమారు 22% ఉన్నాయని గుర్తించింది.
ఇది కూడా చదవండి: APAAR ID Card: ఆధార్ కార్డులాగా విద్యార్థులకు అపార్ కార్డ్.. దీని ప్రయోజనం ఏంటి?
అనేక పారామీటర్లను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఏఐ ఆధారిత వ్యవస్థ ఈ అవాంఛిత ప్రయత్నాలను రియల్ టైమ్‌లో కచ్చితత్వంతో గుర్తించగలిగింది. ఈ అద్భుతమైన ప్రయత్నం భారతదేశంలో పెరుగుతున్న స్పామ్ ముప్పుకు సమగ్ర పరిష్కారాన్ని అందించే మొదటి సర్వీస్ ప్రొవైడర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది.
సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 ప్రీఫిక్స్‌తో కూడిన 10 అంకెల నంబర్లను భారత ప్రభుత్వం కేటాయించింది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, స్టాక్ బ్రోకర్లు, ఇతర ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు, ఎంటర్ప్రైజెస్, ఎస్ఎంఈలు, లావాదేవీలు, సర్వీస్ కాల్స్ చేయడానికి ఉపయోగించే పెద్ద, చిన్న వ్యాపారాలకు కేటాయించిన ఈ 160 ప్రీఫిక్స్ సిరీస్‌ల నుంచి కస్టమర్లు కాల్స్ పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Tech Tips: మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ ఉత్తమమైనది? ఇలా తెలుసుకోండి!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి