Tech Tips: మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ ఉత్తమమైనది? ఇలా తెలుసుకోండి!

Mobile Network: జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సిమ్‌ కార్డు వినియోగదారులు nperf, opensignal సహాయంతో ఆన్‌లైన్‌లో మొబైల్ నెట్‌వర్క్‌ను కనుగొనవచ్చు. అప్పుడు మీరు మీ ప్రాంతంలో మంచి నెట్‌వర్క్ ఉన్న కంపెనీ నుండి సిమ్

Tech Tips: మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ ఉత్తమమైనది? ఇలా తెలుసుకోండి!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 09, 2024 | 3:59 PM

ఈ రోజుల్లో జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారిపోయాయి. దీంతో మొబైల్ వినియోగదారుల నెలవారీ ఖర్చు కూడా పెరిగింది. ఇది కాకుండా దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు పేలవమైన నెట్‌వర్క్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాల్ డ్రాప్, మొబైల్ సిగ్నల్ లేకపోవడం వల్ల వినియోగదారులు కాల్‌లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా సార్లు ఇంటర్నెట్ సేవ నిలిచిపోతుంది. దీంతో వినియోగదారులు తమ కార్యాలయ పనులు చేసుకోలేకపోతున్నారు.

అయితే ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి ఒక ట్రిక్‌ ఉంది. దీని కోసం మీరు మీ ప్రాంతంలో ఎక్కువ నెట్‌వర్క్ ఉన్న టెలికాం ఆపరేటర్ నుండి సిమ్ పొందాలి. సిమ్ కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలో ఏ మొబైల్ నెట్‌వర్క్ ఉత్తమమో మీరు ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సిమ్‌ కార్డు వినియోగదారులు nperf, opensignal సహాయంతో ఆన్‌లైన్‌లో మొబైల్ నెట్‌వర్క్‌ను కనుగొనవచ్చు. అప్పుడు మీరు మీ ప్రాంతంలో మంచి నెట్‌వర్క్ ఉన్న కంపెనీ నుండి సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ OpenSignal మొబైల్ యాప్ ఉంది. Nperf అనేది 2G, 3G, 4G, 5G నెట్‌వర్క్‌లను గుర్తించడంలో మీకు సహాయపడే వెబ్‌సైట్. Android, iOS మొబైల్ వినియోగదారుల కోసం OpenSignal యాప్ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇలా నెట్‌వర్క్ కవరేజీని కనుగొనండి:

nperf ఒక గ్లోబల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ దేశంలో ఆన్‌లైన్‌లో అన్ని మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ గురించి తెలుపుతుంది. ఈ వెబ్‌సైట్ పూర్తిగా ఉచితం. దీన్ని ఉపయోగించడం కోసం మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

nperf వెబ్‌సైట్ నుండి నెట్‌వర్క్ కవరేజీని ఎలా కనుగొనాలి?:

  • ముందుగా nperf వెబ్‌సైట్ nperf.comని సందర్శించండి.
  • ఆపై ఎగువన ఉన్న మై అకౌంట్ ఆప్షన్‌లో వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రొఫైల్‌ను సృష్టించండి.
  • తర్వాత మీరు nperf వెబ్‌సైట్‌లో డాష్‌బోర్డ్‌ను చూస్తారు.
  • అక్కడ ఉన్న మ్యాప్ ఎంపికపై క్లిక్ చేయండి.
  • అప్పుడు దేశం, మొబైల్ నెట్‌వర్క్ ఎంపికను ఎంచుకోండి.
  • దీని తర్వాత స్థలం లేదా నగరం కోసం సెర్చ్‌ చేయండి
  • ఇప్పుడు మొబైల్ వినియోగదారులు తమ ప్రాంతంలో Jio, Airtel, Vodafone Idea BSNL సిగ్నల్‌లను కనుగొనవచ్చు.

ఓపెన్ సిగ్నల్ యాప్‌తో నెట్‌వర్క్‌ను ఎలా సెర్చ్ చేయాలి?:

  • ముందుగా ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి ఓపెన్ సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • దీని తర్వాత మీరు దిగువన 5 ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఇందులో థర్డ్ ఆప్షన్ మ్యాప్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీరు లొకేషన్, ఆపరేటర్, నెట్‌వర్క్ కేటగిరిని ఎంచుకోవాలి.
  • దీని తర్వాత మీరు మీ ప్రాంతంలో ప్రస్తుత మొబైల్ నెట్‌వర్క్‌ను కనుగొంటారు.
  • ఈ యాప్‌లో మీరు Jio, Airtel, Vodafone-Idea, BSNL నెట్‌వర్క్ కవరేజీని పొందుతారు.
  • మ్యాప్‌లో కనిపించే ఆకుపచ్చ గీతలు మంచి నెట్‌వర్క్ కవరేజీని సూచిస్తాయి. అలాగే రెడ్ అంటే నెట్ వర్క్ మంచిది కాదు. పసుపు అంటే తక్కువ నెట్‌వర్క్ కవరేజ్ ఉందని అర్థం.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి