SIM Card: మీ పేరుపై ఎవరైనా సిమ్ కార్డును వాడుతున్నారా? తెలుసుకోవడం ఎలా?
SIM Card: నకిలీ సిమ్ కార్డ్‌ని ఉపయోగించి ఎవరైనా మన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? మీ పేరు మీద ఎవరైనా నకిలీ సిమ్ కార్డు తీసుకున్నట్లయితే వాటిని బ్లాక్ చేసుకునే సదుపాయం ఉంది. ఒక ఆధార్‌తో ఎన్ని సిమ్ కార్డ్‌లు తీసుకోవచ్చు? ఈ విధంగా సిమ్ కార్డుకు సంబంధించిన మరింత సమాచారం తెలిసిపోతుంది..
SIM Card: మీ వద్ద ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయి? వాటన్నింటినీ మీరే ఉపయోగిస్తున్నారా? లేక పోగొట్టుకున్న సిమ్ కార్డును మరెవరైనా వాడుతున్నారా..? అనే అనేక విషయాలపై చాలా మందికి ఆందోళనలు, సందేహాలు ఉంటాయి. మీ పేరు మీద ఎవరైనా నకిలీ సిమ్ కార్డ్ తీసుకున్నారని తెలుసుకోవడానికి ఇప్పుడు కొన్ని మార్గాలు ఉన్నాయి. నేడు అనేక మోసాలు జరుగుతున్న కాలం. సిమ్ కార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నకిలీ సిమ్‌కార్డులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆ సిమ్ కార్డు మీరు తీసుకోకున్నా మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ కార్డును జారీ అవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఒక ఆధార్‌తో ఎన్ని సిమ్ కార్డ్‌లు తీసుకోవచ్చు? ఈ విధంగా సిమ్ కార్డుకు సంబంధించిన మరింత సమాచారం తెలిసిపోతుంది. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుతో గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులను మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డులో తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉన్నట్లు తేలితే, రూ.50,000 నుండి రూ.2 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. కానీ తరచూ ఇలాంటి పొరపాట్లు మనకు తెలియకుండానే జరుగుతుంటాయి.
అలా జరిగితే, మీ వద్ద ఉన్న SIM కార్డ్‌లలో అవసరం లేనివి ఎంచుకుని వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి..? మీకు తెలియకుండా వేరే వాళ్లు మీ పేరుపై సిమ్‌కార్డును వాడుతున్నట్లయితే సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగాTAFCOP పోర్టల్ tafcop.sancharsaathi.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ మీ ఫోన్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలిసిపోతుంది. అందులో మీరు వాడని సిమ్ కార్డు ఉన్నట్లయితే ఇతరులు వాడుతున్నట్లు అర్థం. వెంటనే అలాంటి వాటిని రిపోర్ట్ చేసి తొలగించుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి