ఎవరైనా మీకు వాట్సాప్ మెసేజ్ పంపి, దానికి రిప్లై ఇవ్వడం మర్చిపోయినట్లు మీకు ఎప్పుడైనా జరిగిందా? చాలా సార్లు మనం కొంత సమయం తర్వాత ప్రత్యుత్తరం ఇస్తాం అని అనుకుంటాం.. కానీ తర్వాత మర్చిపోతాం. అటువంటి పరిస్థితిలో మనం సమాధానం ఇవ్వకపోతే ఆ వ్యక్తి మన గురించి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తాము. కానీ మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇది మీకు ప్రత్యుత్తరం ఇవ్వమని గుర్తు చేస్తుంది.