AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G-Mail AI Service: మెయిల్స్ చదవడానికి కూడా ఏఐ సేవలు.. జీ-మెయిల్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ లాంచ్…!

ఇటీవల కాలంలో గూగుల్ సేవలను ప్రతి ఒక్కరూ ఆశ్వాదించడం మొదలు పెట్టాక ప్రతి ఒక్కరికీ అధికారిక మెయిల్ కింద జీ-మెయిల్ ఉంటున్న పరిస్థితి మన చూస్తున్నాం. కానీ ఒక్కోసారి మన మెయిల్స్ సుధీర్ఘ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. అయితే సుదీర్ఘ ఇమెయిల్‌లను చదివే సమయాన్ని ఆదా చేయడంలో వినియోగదారులకు సహాయపడటానికి జీ-మెయిల్ ఇటీవల ఏఐ సాయంతో మెయిల్‌లో ఉండే సారాంశాన్ని ముందుగునే వినియోగదారులకు అందించే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

G-Mail AI Service: మెయిల్స్ చదవడానికి కూడా ఏఐ సేవలు.. జీ-మెయిల్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ లాంచ్…!
Gmail
Nikhil
|

Updated on: Jul 06, 2024 | 10:51 PM

Share

గతంలో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలకు ఇండియన్ పోస్ట్స్ ద్వారా డాక్యూమెంట్లను పంపేవారు. అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం గత 15 ఏళ్లుగా ఈ-మెయిల్స్ పంపడం అనేది పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో గూగుల్ సేవలను ప్రతి ఒక్కరూ ఆశ్వాదించడం మొదలు పెట్టాక ప్రతి ఒక్కరికీ అధికారిక మెయిల్ కింద జీ-మెయిల్ ఉంటున్న పరిస్థితి మన చూస్తున్నాం. కానీ ఒక్కోసారి మన మెయిల్స్,కు సుధీర్ఘ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. అయితే సుదీర్ఘ ఇమెయిల్‌లను చదివే సమయాన్ని ఆదా చేయడంలో వినియోగదారులకు సహాయపడటానికి జీ-మెయిల్ ఇటీవల ఏఐ సాయంతో మెయిల్‌లో ఉండే సారాంశాన్ని ముందుగునే వినియోగదారులకు అందించే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ-మెయిల్ సంభాషణలకు సంబధించిన సంక్షిప్త రీక్యాప్‌లను అందించడానికి ఈ ఫీచర్ రూపొందించారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీ-మెయిల్ ఏఐ సర్వీసుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

వినియోగదారులు సుదీర్ఘమైన థ్రెడ్‌ల ద్వారా చదవకుండానే వారి ఇన్‌బాక్స్‌ల్లో ఉండే మెయిల్స్‌ సారాంశాన్ని జీ-మెయిల్ తీసుకొచ్చిన ఏఐ ఫీచర్ వినియోగదారులకు అందిస్తుంది. ముఖ్యంగా వెబ్‌లోని జెమిని సైడ్ ప్యానెల్‌లో భాగంగా దీన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ కోసం ప్రత్యేకంగా చెల్లింపు కస్టమర్‌ల కోసం ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ ఫీచర్ కోసం బటన్ సింగిల్-థ్రెడ్ ఇమెయిల్‌లలో కనిపించనప్పటికీ సంభాషణలో కనీసం రెండు ప్రతిస్పందనలు ఉన్నప్పుడు అది అందుబాటులోకి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే పొడిగించిన చర్చలను మినిమైజ్ చేయడంతో పాటు కీలకమైన అంశాలను మిస్ కాకుండా చూసుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వినియోగదారులు సారాంశం బటన్‌ను నొక్కిన తర్వాత కొన్ని సెకన్లలో అది బుల్లెట్ పాయింట్ల రూపంలో సారాంశాన్ని రూపొందిస్తుంది. స్క్రీన్ దిగువ నుంచి పైకి వెళ్లే షీట్‌లో సారాంశం ప్రదర్శితమవుతుంది. షీట్ దిగువన ఫాలో-అప్ ప్రాంప్ట్‌లను నమోదు చేయడానికి ప్రస్తుతం ఫీల్డ్ లేనప్పటికీ రాబోయే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. 

జీ మెయిల్‌లో అందుబాటులోకి వచ్చే ఏఐ ఫీచర్ కొంత మంది వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ తాజా ఫీచర్‌తో మెయిల్ సారాంశంతో పాటు జీమెయిల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సందర్భోచిత స్మార్ట్ ప్రత్యుత్తరాన్ని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఈ ఫీచర్ ఈ-మెయిల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు.  జెమిని వెబ్ జీమెయిల్‌లో జెమిని 1.5 ప్రో ద్వారా ఆధారితమైన కొత్త సైడ్ ప్యానెల్ ఫీచర్‌ను కూడా విడుదల చేస్తోందని పేర్కొంటున్నారు. ఈ ఫీచర్ ద్వారా ఏఐ ఆధారిత సైడ్ ప్యానెల్ ఈ-మెయిల్ థ్రెడ్‌ను సంగ్రహించవచ్చు. అలాగే మన ప్రతిస్పందనలను సూచించే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఈ-మెయిల్‌లను డ్రాఫ్ట్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్‌బాక్స్‌లోని ఈ-మెయిల్‌ల నుంచి లేదా గూగుల్ డిస్క్ ఫైల్‌ల నుంచి నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. వినియోగదారులు ప్రోయాక్టివ్ ప్రాంప్ట్‌లను ట్రిగ్గర్ చేసే జెమిని స్పార్కిల్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఈ ఫీచర్‌లను సగటు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..