Smartphone: పిల్లలకు ఆశ్లీల కంటెంట్‌ కనిపించొద్దంటే.. ఈ సెట్టింగ్స్‌ను మార్చుకోండి

బ్రౌజింగ్‌ చేస్తూ వెళ్తున్న సమయంలో చిన్నారులకు తమకు తెలియకుండానే అడల్ట్‌ కంటెంట్‌ కనిపించే అవకాశం ఉంటుంది. ఇది చిన్నారుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే చిన్నారులు ఫోన్‌ చూసే సమయంలో పెద్దలకు సంబంధించిన కంటెంట్‌ కనిపించకూడదంటే స్మార్ట్‌ ఫోన్‌లో కొన్ని రకాల సెట్టింగ్స్‌ చేంజ్‌ చేసుకోవాలి. ఇంతకీ ఆ సెట్టింగ్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Smartphone: పిల్లలకు ఆశ్లీల కంటెంట్‌ కనిపించొద్దంటే.. ఈ సెట్టింగ్స్‌ను మార్చుకోండి
Kids Phone
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 04, 2024 | 8:36 PM

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. కేవలం పెద్దలే కాకుండా చిన్నారులు కూడా స్మార్ట్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ఫిజికల్‌ గేమ్స్‌ ఆడే చిన్నారులు ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. అయితే చిన్నారులు స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారన్న దానిపై పెద్దల్లో ఆందోళన నెలకొనడం సర్వసాధారణం.

బ్రౌజింగ్‌ చేస్తూ వెళ్తున్న సమయంలో చిన్నారులకు తమకు తెలియకుండానే ఆశ్లీల కంటెంట్‌ కనిపించే అవకాశం ఉంటుంది. ఇది చిన్నారుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే చిన్నారులు ఫోన్‌ చూసే సమయంలో పెద్దలకు సంబంధించిన కంటెంట్‌ కనిపించకూడదంటే స్మార్ట్‌ ఫోన్‌లో కొన్ని రకాల సెట్టింగ్స్‌ చేంజ్‌ చేసుకోవాలి. ఇంతకీ ఆ సెట్టింగ్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

* తర్వాత ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌ కోసం సెర్చ్‌ చేయండి. ‘ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌’ అని టైప్ చేసి సెర్చ్‌ చేయాలి.

* ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌ను క్లిక్‌ చేయాలి. క్రియేట్‌ ప్రైవేట్ DNSని సెలక్ట్‌ చేసుకోవాలి. సెటప్‌ డీఎన్‌ఎస్‌ బాక్స్‌లో ‘family.adguard-dns.com’ అని టైప్ చేసి సేవ్ చేయండి.

* ఇలా చేయడం ద్వారా మీ చిన్నారుల ఫోన్‌లలో పెద్దలకు సంబంధించిన కంటెంట్ మొత్తం బ్లాక్ అవుతుంది. పొరపాటున కూడా అలాంటి కంటెంట్‌ వారికి కనిపించదు.

గూగల్‌ కిడ్స్‌ స్పేస్‌..

అడల్ట్‌ కంటెంట్‌కు అడ్డుకట్ట వేయడానికి గూగుల్‌ కిడ్స్‌ స్పేస్‌ కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై ‘డిజిటల్ వెల్‌బీయింగ్’ ఆపై ‘పేరెంటల్ కంట్రోల్’ సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీ చిన్నారుల ఆన్‌లైన్‌ సర్ఫింగ్‌పై నిఘా ఉంచవచ్చు.

యాప్‌ పిన్నింగ్ ఫీచర్‌..

మీ పిల్లలు ఒకే యాప్‌ని ఉపయోగించాలనుకుంటే ఫోన్‌లో ‘యాప్ పిన్నింగ్’ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్‌ పిన్నింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీరు పిన్‌ చేసిన యాప్‌ను మాత్రమే మీ చిన్నారి ఉపయోగించేలా పర్మిషన్‌ ఇస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..