Vivo T3 Lite 5G: రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..

మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌లు ఎక్కువగా లాంచ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో టీ3 లైట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jul 04, 2024 | 9:21 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో టీ3 లైట్‌ 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ తొలి సేల్‌ గురువారం (జులై 4వ తేదీ) ప్రారంభమైంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి తీసుకొచ్చారు.

1 / 5
వివో టీ3 లైట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,499గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,499గా ఉంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 500 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ను రూ. 10 వేలకే పొందొచ్చు.

2 / 5

3 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. పోర్ట్రెయిట్, ఫోటో, పానో, టైమ్-లాప్స్, స్లో-మో ఫీచర్స్‌ను అందించారు.

4 / 5
ఇక వివో టీ3 లైట్‌ స్మార్ట్ ఫోన్‌లో 15 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో డ్యూయల్ సిమ్ స్లాట్, 5G, Wi-Fi, GPS, FM, OTG, NFC, యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌ను అందించారు. ఈ ఫోన్‌ బరువు 185 గ్రాములుగా ఉంది.

5 / 5
Follow us