Lava Blaze X 5G: లావా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ ఫోన్‌.. ప్రీమియం లుక్స్‌తో..

లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ఇక జుల్‌ 20వ తేదీన అమెజాన్‌ అందించనున్న అమెజాన ప్రైమ్‌ డే సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.?

Lava Blaze X 5G: లావా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ ఫోన్‌.. ప్రీమియం లుక్స్‌తో..
Lava
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 04, 2024 | 6:28 PM

ప్రముఖ భారతీయ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంతో ఎప్పుడూ ముందుంటుందీ సంస్థ. బడ్జెట్‌ ధరలో ప్రీమియం లుక్స్‌, స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్న లావా తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది.

లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ఇక జుల్‌ 20వ తేదీన అమెజాన్‌ అందించనున్న అమెజాన ప్రైమ్‌ డే సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్సలో లాంచ్‌ చేయనున్నారు. వీటిలో 4 జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌ ఉన్నాయి. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించనున్నారు. స్క్రీన్‌ పరంగా చూస్తే ఇందులో అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో అందుబాటులోకి తెస్తున్నారు.

ఇందులో USB టైప్ C పోర్ట్, స్పీకర్ గ్రిల్ వంటి ఫీచర్స్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఫోన్‌కు కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్స్‌ ఉండనున్నాయి. లుక్స్‌ పరంగా ఫోన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా బ్లేజ్‌ లెస్‌ స్క్రీన్‌, పంచ్‌ హోల్‌ కెమెరాను ఇవ్వనున్నారు. దీంతో ఫోన్‌ను రిచ్‌ లుక్‌ వచ్చింది. ధర విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఫోన్‌ రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్